నవరాత్రుల్లో నాలుగవ రోజు పూజించే కుష్మాండ అమ్మవారి విశిష్టత!!!

దసరా.. అంటేనే మనందరికీ గుర్తుకు వచ్చేవి తొమ్మిది రోజులపాటు అతి వైభవంగా ఉత్సవాలు జరిగే నవరాత్రులు. శరదృతువులో రావడం వల్ల ఈ నవరాత్రులను శరన్నవ రాత్రులని అంటారు. ఒక్కోరోజు దుర్గదేవి ఒక్కో విశిష్టమైన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి అనేక ఆధ్యాత్మిక అనుభూతులను ఇస్తుంది.

నవరాత్రి పూజల్లో 4వ రోజున, కుష్మాండ అమ్మవారిని పూజిస్తారు. కుష్మాండ అంటే విశ్వం సృష్టించిన వ్యక్తి. ఈ అమ్మవారు సింహం మీద స్వారీ చేస్తూ, ఎనిమిది చేతులతో ఏడు ఘోరమైన ఆయుధాలను కలిగి, ఒక జపమాలను కలిగి ఉంటుంది.

kushmanda deviకుష్మాండ దేవి యొక్క కథ :
కుష్మాండ అమ్మవారు మొత్తం విశ్వం యొక్క మూలకర్త అయిన కారణంగా “ఆదిశక్తి” అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారు సూర్య భగవానుడిలో నివాసం ఉంటుంది. అందువల్ల విశ్వంలో నుండి వచ్చే అన్ని చీకట్లను తొలగించి అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది.

kushmanda deviకుష్మాండ అంటే చిన్న గ్రుడ్డుగా సూచించేటటువంటిది, కుష్మాండ అమ్మవారు ఈ మొత్తం సృష్టిని చిన్న గ్రుడ్డులా సృష్టించబడిన తర్వాత అందులోనుంచి విశ్వం అనేది ఆవిర్భవించింది. ఈ అమ్మవారే సూర్యదేవునికి స్వయం ప్రకాశితంగా వెలుగునిచ్చే శక్తిని ప్రసాదించినది. ఆ తల్లి చిరునవ్వే మన జీవితంలో ఆనందభరితమైన యోగాన్ని, శక్తిని కలుగజేస్తూ, అన్ని వైపుల నుంచి ఆశలను -ఆశీర్వాదాలను కలుగజేసేదిగా ఉంటుంది.

lord suryaఈ అమ్మవారు సూర్యభగవానుడికి శక్తిని కలుగజేసి, మార్గనిర్దేశకత్వం చేస్తూ, సూర్యుడిని పరిపాలిస్తుంది. మీ జాతకంలో సూర్యుని అనానుకూలత వల్ల సృష్టించబడే బాధలను అన్నింటిని తొలగిస్తుంది. అంతేకాకుండా, అన్ని రకాల రోగాల నుండి ఉపశమనం కలిగించేదిగా మరియు సమాజంలో కీర్తిని, మంచి హోదాను పొందేలా చేస్తుంది.

flowerఈ అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన పువ్వులుగా – ఎర్ర రంగు పువ్వులను ఉపయోగిస్తారు. నవరాత్రుల్లో 4వ రోజున ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ అమ్మవారు సున్నితమైన రూపాన్ని కలిగి ఉన్నందున, షోడశోపచారాలతో కొలువుతీరి, చివరిలో హారతిని పూజించడం ద్వారా అమ్మవారు మీ కుటుంబ సంక్షేమం కోసం, ఉన్నతమైన హోదాని కలిగిస్తుంది .

పూజ, ప్రాముఖ్యత :
నవరాత్రి 4వ రోజున కుష్మాండ అమ్మవారికి ప్రార్థించడం వల్ల అన్ని వ్యాధులను తొలగించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించగలదు. మీరు పనిచేస్తున్న చోట పెద్దవారితో, సీనియర్లతో, వృద్ధులతో మంచి సంబంధాలను మెరుగు పరిచేలా చేసి మీ యొక్క వ్యక్తిగత పురోగతికి మద్దతు లభించేలా చేస్తుంది. సామాజిక సమస్యలు కలిగిన వ్యక్తులకు, మంచి స్థాయిని ఇస్తుంది ఈ తల్లి.

diabetes and other diseases

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR