వర్షాలు పడుతుంటే అందరూ ఎదుర్కునే సమస్యలు జలుబు, దగ్గు వాటివల్ల వచ్చే జ్వరాలు. వాతావరణం మారినపుడు జలుబు రాకుండా వైద్య శాస్త్రంలో ఇప్పటివరకూ మందు కనుగొనలేదు. నిజానికి జలుబుకి ఎటువంటి మందులు అవసరం లేదు.. కొన్ని రోజులు ఇబ్బంది పెట్టి అదే తగ్గుతుంది.. అయితే ప్రస్తుతం కరోనా సమయం కనుక ఏది సీజనల్ వ్యాధి.. ఏది కరోనా అనేది తెలియక బయపడిపోతున్నారు.
జలుబు నుంచి సత్వరం నివారణ ఇచ్చేది ఆవిరి పట్టడం అయితే ఎక్కువమంది పసుపు, విక్స్ వేసుకుని ఆవిరి పడతారు.. కానీ దీనికంటే జలుబు నుంచి మంచి రిలీఫ్ ని ఇచ్చేది పుదీనా ఆవిరి అంటున్నారు ఆరోగ్య నిపుణలు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు పుదీనా ఆకులతో ఆవిరి పట్టుకుంటే తొందరగా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఎన్నో ఔషధ గుణాలు దాగిఉన్న పుదీనా ఆకులను మరుగుతున్న వేడి నీటిలో వేసి ఆవిరి పట్టడం ద్వారా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ వేడి ఆవిరిని నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కు, నోరు, గొంతు శుభ్రపడతాయి. గాలి పీల్చడానికి ఇబ్బంది ఉండదు. ఇక పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రకరకాల అలర్జీలనూ, ఆస్తమాను నివరిస్తుంది.
పుదీనాలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీల నుంచి పుదీనా విముక్తిని కల్పిస్తుంది.అలాగే గొంతు ఇన్ఫెక్షన్ జలుబు సమస్యతో బాధపడేవారు పుదీనా టీ చేసుకొని తాగడం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.