Need Of The Hour: A Life Altering Lesson By Nelson Mandela For This Turbulent Generation

నెల్సన్ మండేలా డైరీలో విలువైన పేజీ

నేను నా అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తులతో మధ్యాహ్నం భోజనానికి హోటల్ వెళ్లాను. వెయిటర్ వచ్చి మా ఆర్డర్ తీసుకువెళ్లిన తర్వాత కాసేపటికి మా భోజనం వచ్చింది. సరదాగా మాట్లాడుకుంటూ, మేం తినడం ప్రారంభించే ముందు నా దృష్టి ఎదురుగా ఉన్న టేబుల్ లో ఒంటరిగా కూర్చున్న వ్యక్తి మీద పడింది. అతనికి ఇంకా భోజనం రాలేదు. నన్ను అతడు చూడగానే చటుక్కున లేచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అతని ఖర్మ కాలి భోజనం వచ్చింది. అతను నిస్సహాయంగా కూలబడిపోయాడు.

నేనతణ్ని చూసి, పలకరింపుగా నవ్వి, నా పక్కన కూర్చోమంటే, కలిసి భోంచేద్దామంటూ ఆహ్వానించాను. వెయిటర్ సైగ చేయగానే, అతడి భోజనం నా పక్కన పెట్టి వెళ్లాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు. మా భోజనం త్వరత్వరగా అవుతోంది. కానీ, అతనికి ముద్ద గొంతు దిగడం లేదు. చేతులు వణుకుతున్నాయి. దిక్కులు చూస్తూ మాటిమాటికీ నీళ్లు తాగుతూ మొహం తలుచుకుంటున్నాడు.

మా అందరి భోజనం అయ్యాక అతను, సగం తిండిని కతికినట్టు చేసి వడివడిగా వెళ్లిపోయాడు. అతనిని గమనించిన నా మిత్రుడు బాగా అనారోగ్యంగా ఉన్నట్టున్నాడు. అస్సలు తినలేకపోతున్నాడు. వణుకుతున్నాడు..! అంటూ కామెంట్ వదిలాడు. అప్పుడు నేను “లేదురా..! అతను ఆరోగ్యంగానే ఉన్నాడు.నేను జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు నా సెల్ సెంట్రీ ఇతను ప్రతిరోజూ నన్ను విపరీతంగా, అకారణంగా కొడుతూ హింసించేవాడు. హింస వల్ల నొప్పులు, బాధతో అరిచి అరిచి నా గొంతు ఆర్చుకుపోయి దాహంతో నీళ్లిమ్మని అడిగితే, హేళనగా నవ్వుతూ నామొహం మీద మూత్రం పోసే వాడు, మాఅమ్మ పాలకన్నా ఇతని మూత్రాన్నే ఎక్కువ తాగాను.

మా అమ్మ ప్రేమను నేర్పితే, ఇతడు ఓపిక నేర్పాడు. నన్నిప్పుడు ఈ హోదా లో చూసి భయపడి, వణికిపోతున్నాడు. నేను తన మీద ప్రతీకారం తీర్చుకుంటానేమోనని, ఉద్యోగం పీకేస్తానేమో, జైలులో వేస్తాను ఏమో..! అని ముందే ఊహించికొని భయపడుతున్నాడు. నా వ్యక్తిత్వం, నా నైతికత అది కాదు! పనికిరాని ప్రతీకారం మనుషుల మధ్య గోడలు కడితే, క్షమ ఒక్కటి చేస్తుంది! సౌభ్రాతృత్వం శాంతినిస్తుంది కదా..!”

నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యాక జరిగిన యధార్ధ సంఘటన.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR