List Of Tollywood Movies Which Earned The Highest TRP Rating This Year

ఇప్పట్లో ఓ సినిమాకి మంచి టాక్ వస్తేనే కానీ.. జనాలు థియేటర్లకు వెళ్ళట్లేదు. ఒకవేళ డివైడ్ టాక్ లేదా ప్లాప్ టాక్ వస్తే.. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఆన్లైన్ స్ట్రామింగ్ ప్లాట్ ఫాన్స్ లో చూడొచ్చు లే అని లైట్ తీసుకుంటున్నారు. ఒక వేళ దానికి కూడా సమయం లేకపోతే పండగ రోజున లేదా సెలవు రోజున టీవీలో టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూడొచ్చులే అని ఎదురుచూస్తున్నారు. థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు ఎంతవరకూ వస్తుందో చెప్పలేము కానీ.. ఇలా డిజిటల్ మరియు స్ట్రామింగ్ రైట్స్ రూపంలో మాత్రం గట్టిగానే అందుతుంది. కోట్లకు కోట్లు పెట్టి డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంటున్నారు ప్రముఖ ఛానెల్ వారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది అత్యధిక టి.ఆర్.పి రేటింగ్ లు నమోదు చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎఫ్2 :

F2ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్2’ చిత్రం బుల్లితెర పై కూడా మంచి టి.ఆర్.పి ను నమోదు చేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం బుల్లితెర పై 17.2 టి.ఆర్. పి ని నమోదు చేసింది.

2) ఇస్మార్ట్ శంకర్ :

Ismart Shankarరామ్, పూరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం బుల్లితెర పై కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం 16.63 టి.ఆర్. పి ని నమోదు చేసింది.

3) కాంచన 3 :

Kanchan 3‘ముని’ సిరీస్ లో భాగంగా లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన ‘కాంచన3’ కూడా అదిరిపోయే టి.ఆర్. పి ని నమోదు చేసింది. ఈ చిత్రానికి కూడా 13.10 టి.ఆర్. పి ని నమోదు కావడం విశేషం.

4) రాక్షసుడు :

Rakshsashuduబెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘రాట్సాసన్’ రీమేక్ ‘రాక్షసుడు’ చిత్రం కూడా మంచి టి.ఆర్. పి ని నమోదు చేసింది. రమేష్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బుల్లితెర పై 10.1 టి.ఆర్. పి ని నమోదు చేయడం విశేషం.

5) మహర్షి :

Maharashiఏంటో థియేటర్లలో ఎక్కువగా సినిమా చూసెయ్యడం.. అలాగే అమెజాన్ ప్రైమ్ లో కూడా ఎక్కువగా చూసెయ్యడం వలనో ఏమో కానీ.. ‘మహర్షి’ చిత్రం కేవలం 9.2 టి.ఆర్.పి తో సరిపెట్టుకుంది.

6) ఓ బేబీ :

Oh Babyసమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకురాలు. బుల్లితెర పై ఈ చిత్రం 9 టి.ఆర్.పి ని నమోదుచేసింది.

7) జెర్సీ :

Jerseyనేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి బుల్లితెర పై 8.8 టి.ఆర్.పి ని నమోదయ్యింది.

8) మజిలీ :

Majiliపెళ్ళైన తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మజిలీ’. బుల్లితెర పై ఈ చిత్రం 7.9 టి.ఆర్.పి ని నమోదుచేసింది

9) వినయ విధేయ రామా :

Vvrరాంచరణ్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ.. బుల్లితెర పై బాగానే వర్కౌట్ అయ్యింది. ఈ చిత్రానికి కూడా 7.9 టి.ఆర్.పి నమోదయ్యింది.

10) సీత :

Seethaబెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘సీత’ చిత్రాన్ని తేజ డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ బుల్లితెర పై మాత్రం మంచి టి.ఆర్.పి ని నమోదుచేసింది. ఈ చిత్రానికి 7.53 టి.ఆర్.పి నమోదయ్యింది.

11) 118 :

118నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘118’ చిత్రం ఈ ఏడాది హిట్ లిస్ట్ లో ఒకటిగా నిలిచింది. బుల్లితెర పై కూడా ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ చిత్రానికి 6.33 టి.ఆర్.పి నమోదయ్యింది.

12) సైరా నరసింహారెడ్డి :

Sye Raaమెగాస్టార్ 151 వ చిత్రంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా బుల్లితెర పై ప్రదర్శింపబడలేదు. అయితే తమిళ వెర్షన్ ప్రీమియర్ టెలికాస్ట్ చేయగా ఏకంగా 15.3 రికార్డు టి.ఆర్.పి నమోదయ్యింది. నయన తార, విజయ్ సేతుపతి వంటి కోలీవుడ్ స్టార్లు ఈ చిత్రంలో ఉండడంతో.. రికార్డు టి.ఆర్.పి నమోదైనట్టు తెలుస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR