దక్ష ప్రజాపతికి పునర్జన్మ ప్రసాదించిన ప్రదేశం ఎక్కడ ?

0
2303

మన దేశంలో అమ్మవారి అద్భుత ఆలయాలు చాలా ఉన్నాయి. సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిశాయని చెబుతారు. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు. అయితే పరమశివుడు సతీదేవి తండ్రి అయినా దక్ష ప్రజాపతి కి పునర్జన్మ ప్రసాదించిన ప్రదేశం ఇదేనని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? మనసాదేవి ఎవరు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Manasa devi temple

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, హరిద్వార్ అనే పుణ్యక్షేత్రం ఉంది. హరి అంటే విష్ణువు, ద్వారం అంటే లోపలకీ ప్రవేశించే మార్గం అంటే హరిణి చేరే దారి అని అర్ధం. సతీదేవి అగ్నికి ఆహుతైన ప్రదేశం ఇదేనని చెబుతారు. అయితే హరిద్వార్ కి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో కంకల్ అనే ప్రదేశంలో ఉన్న ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఒక పర్వతం పైన మనసాదేవి ఆలయం ఉంది.

Manasa devi shiva

ఇక పురాణానికి వస్తే, దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగం లో అవమాన భారానికి గురై సతీదేవి ఆత్మహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు కోపానికి గురై వీరభద్రుడు సృష్టించి దక్ష ప్రజాపతి తలని నరికి సంహరిస్తాడు. ఆ తరువాత, శివుడు సతీదేవి నిర్జీవ దేహాన్ని తన భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేస్తుండగా, శివుడిని శాంతిప చేయడానికి విష్ణువు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. దాంతో ఆమె దేహం 18 ఖండాలై భూలోకంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. కాలక్రమంలో అవే అష్టాదశ శక్తి పీఠాలు గా అవతరించాయి. ఇక ఆ తరువాత శివుడు దక్షుడిని పునర్జన్మని ప్రసాదించిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇక సతి దేవి ఆత్మాహుతి స్మారకంగా ఈ ఆలయం వెలిసిందని చెబుతారుManasa devi temple

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, మహాఋషి అయినా కాశ్యప ఋషి మానస కుమార్తె.ఈ దేవత నాగుల రాజైన నాగ వాసుకి భార్య. ఈ ఆలయంలో రెండు విగ్రహాలు ఉండగా, ఒక విగ్రహానికి ఐదు చేతులు, మూడు నోరులు ఉండగా, మరొక విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే మనసాదేవిగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. అయితే ఈ ఆలయంలో ఒక పురాతన వృక్షం ఉండగా భక్తులు వారి మనసులోని కోరికలు నెరవేరాలని తోరాలు కట్టి వారు కోరిన కోరికలు నెరవేరగానే ఆ ముడిని విప్పివేస్తుంటారు. ఈ ఆలయంలో సతీదేవి మృతదేహాన్ని శివుడు తన భుజం మీద వేసుకొని దర్శనమిచ్చే విగ్రహం భక్తులని విశేషంగా ఆకర్షిస్తుంది.

Manasa devi

కొండమీద ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి మెట్లు లెక్కలేని భక్తుల కోసం ఇక్కడ రోప్ వె కూడా ఉంది. ఇలా కొండపైన వెలసిన మనసాదేవిని దర్శించి కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి దూరప్రాంతాల నుండి కూడా భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

SHARE