హరీష్ శంకర్ అగ్రహారంలో పుట్టిన ఈయన ఆలోచనలు అన్ని సినిమాల చుట్టే ఉండేది. అందుకే ఇంట్లో నాన్న నేర్పిన వేదాలు, బడిలో గురువులు నేర్పిన పాఠాలు పక్కనబెట్టి సినిమా అనే రంగుల ప్రపంచం లోకి అడుగు పెట్టాడు. తీసిన మొదటి సినిమా ‘Shock’ ఇద్దామని ట్రై చేసిన అది అంతగా ఆడలేదు. ఇలా కాదు ఈ సారి గట్టిగా కొట్టాలని డిసైడ్ అయ్యి రవితేజ బాడీ లాంగ్వేజ్ కి, మాస్ కటౌట్ కి సెట్ అయ్యే స్టోరీ తో Mirapakay తీసాడు అది హిట్ అయ్యింది.
ఈ రెండు సినిమాల తరువాత తాను సినిమాల్లోకి రావడానికిi inspire చేసిన Powerstar తో సినిమా తీసే ఛాన్స్ వచ్చింది. అతను ఎగిరి గంతేయలేదు, తన పైన ఉన్న బాధ్యత ని గమనించి ఒక అభిమానిగా ఎలా చూపిస్తే PK fans థియేటర్స్ లో చొక్కాలు చించుకునేలా Dabangg స్టోరీ ని తీస్కొని ‘గబ్బర్ సింగ్’ గా ఆ స్టోరీ కి పునర్జన్మనిచ్చాడు..
గబ్బర్ సింగ్ లో ఒక్కో డైలాగ్ థియేటర్స్ దద్దరిలికిపోయాయి….పవన్ కళ్యాణ్ అనే కటౌట్ కి ఒక పక్క మాస్ సినిమా పడితే ఎలా ఉంటాదో ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇక్కడ హరీష్ చేసిన మేజిక్ ఏంటంటే…దర్శకుడిగా సినిమా ఎలా తీయాలని కాకుండా ఒక రైటర్ గా ఊర మాస్ డైలాగ్స్ తో పవర్ఫుల్ డైలాగ్స్ రాసాడు.
ఇక్కడ నుండి హరీష్ వేణు తిరిగి చూసుకోలేదు….గబ్బర్ సింగ్ మూవీ అతని కెరీర్ కి ఒక RedBull తగిన ఎనర్జీ ని ఇచ్చింది. అటు దర్శకుడిగా….ఇటు రైటర్ గా హరీష్ శంకర్ రాసిన కొన్ని ఊర మాస్ డైలాగ్స్ బర్తడే స్పెషల్ గా…..
1. నీకు నోరు ఒక్కటే దూలేమో, నాకు నరనరాల్లో, ఒళ్ళంతా దూలే – Mirapakay
2. నాకు పంచ్ లు వేసే వాళ్ళు అంటే ఇష్టమే … కానీ నా మీద పంచ్ లు వేస్తె పళ్ళు రాలుతాయ్ – Mirapakay
3. పేర్లు గోత్రాలు చెప్పడానికి నేను ఏమైనా గుడికొచ్చాను ఏంట్రా ?
తెలుసుకోవడాలు లేవు…తేల్చుకోడాలే…! – – Gabbar Singh
4. Jo Darr Gaya
Samjho Mar Gaya !
5. నాకు కొంచం తిక్క ఉంది
కానీ దానికో లెక్కుంది…!
6. వాడు నా ఫ్యాన్,
నేను చెప్పిన ఒక్కటే …నా ఫ్యాన్ చెప్పిన ఒక్కటే !
7. నాకు నువ్వే కాదు ఎప్పుడు
ఎవడు పోటీ రారు రాలేరు
నాకు నేనే పోటీ , నాతో నాకే పోటీ !
8. నేను ఆకాశం లాంటి వాడిని
ఉరుమొచ్చిన, మెరుపొచ్చిన, పిడుగొచ్చిన,
నేను ఎప్పుడు ఒకేలా ఉంటా !
9. పాపులారిటీ ధీ ఏముందిలే…Passing clouds లాంటిది !
వాతారవం వేడెక్కితే ..వానై కరిగిపోతుంది !
10. డైలాగ్ లు చెప్పడం…కాదురోయి…!
చెప్పిన దాని మీద నిలబడాలి…?
నిలబడి చూపించాలి ! – Gabbar Singh
11. బుడ్డోడు…బుడ్డోడు..అంటే గుడ్డలీడదీసి కొడతా ! – Ramayya Vasthavayya
12. మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ..మనిషి కనపడక్కర్లేదు ! – DJ
13. నా పైన పందాలేస్తే గెలుస్తారు…నా తోటి పందాలేస్తే సస్తారు ! – Valmiki
14. అందుకే పెద్దోళ్ళు చెప్పిర్రు నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే
రెండు కాల్చుకోవాలి రెండు దాచుకోవాలి…!
15. మనం బ్రతుకుతున్నాం అని
పది మందికి తెల్వక పోతే
ఇగ బ్రతుకుడు ఎందుకు రా ?