ఆడవారికి ఎక్కువగా ఇష్టమైనది అలంకరణ. పూర్వంనుండి కూడా మనవారు అలంకారాలకి ఒక ప్రత్యేక స్థానమిచ్చి, తమ అంతస్సౌందర్యంతో పాటు బాహ్య సౌందర్యాన్ని కూడా పెంచుకునేవారని, అందు కోసమే నగలు ధరించే వారనీ అనుకుంటాం. ఐతే మన పూర్వీకులు ఏపనీ నిర్హేతుకంగా చేసేవారు కారన్న మాట యదార్థమని మనం గ్రహించ వలసి ఉంది.
ప్రస్తుతం స్త్రీలు అందంగా కనిపించడానికి వివిధ రకాల నగలను ధరిస్తారు. కానీ ఇప్పటి స్త్రీలను ఈ నగల ప్రాముఖ్యత ఏమిటి అని అడగగా కేవలం అందం కోసం మాత్రమే ఈ నగలను పెట్టుకున్నామని ఎంతో సునాయాసంగా చెబుతారు.
కానీ ఆ నగలు స్త్రీలు ఎందుకు పెట్టుకుంటారో, పెట్టుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు.అయితే స్త్రీలు ధరించే ఈనగల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రవంక :
ఈ నగ స్త్రీల తల మధ్యభాగంలో ధరించి ఉంటారు. తల మధ్య భాగం నుంచి మనకు జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మ రంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ బాగాన ఈ నగతో కప్పి వేస్తారు.
మెడలో వేసుకొనే హారాలు :
వివిధ రకాల నగలను మనం మెడలో దరిస్తాము. మన మనసులో పరమాత్మడు ఉన్నాడని తెలియజెబుతు ఆ నగలను మెడలో ధరిస్తారు. ఈ విధంగా నగలను ధరించడం ద్వారా మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు సైతం తొలగిపోతాయి.
అంతేకాకుండా ఈ బంగారం మన శరీరంపై ఉండటం ద్వారా శరీర వేడిని తగ్గిస్తాయి. మెడలో ధరించిన నగలు మన ఛాతీ పై పడటం ద్వారా జుట్టుకు సంబంధించినటువంటి వ్యాధులు తొలగిపోతాయి.
ముక్కెర :
ముక్కుకు ముక్కెర ధరించడం ద్వారా మనం మాట్లాడేటప్పుడు పైపెదవి ఎక్కువ మాట్లాడకుండా ఆపుతుంది. ముక్కు కొన భాగంలో ముక్కెర ధరించడం ద్వారా మన దృష్టి ఆ ముక్కెర పై పడటం ధ్యానంలో ఒక భాగం. అంతే కాకుండా మనం ఊపిరిని వదిలేటప్పుడు వచ్చే చెడు గాలిని ముక్కెర శుద్ధ చేస్తుంది.
గాజులు :
స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి మన మణికట్టు వద్ద ఉన్న నరాలలో రాపిడి జరిగి రోజంతా ఎంతో చలాకీగా ఉంటూ పనులను కొనసాగిస్తారు. అంతేకాకుండా ఈ గాజులను ధరించడం ఐదవ తనంగా కూడా భావిస్తారు.
కాలి మెట్టెలు :
గర్భకోశంలో ఉన్న నరాలకు, కాలి మెట్టెలకు సంబంధం ఉంటుంది. పెళ్లైన ఆడవారు మెట్టెలు ధరించడం వల్ల ఈ మెట్టెలు నేలకు తాకి వారిలో కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
ఈ విధంగా స్త్రీలు నగలు ధరించడం ద్వారా మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అందుకోసమే పూర్వకాలం రాజులు, చక్రవర్తులు సైతం ఇలాంటి నగలను ధరించే వారు.