అశోక వృక్షం యొక్క ఔషధగుణాలు మరియు ఆయుర్వేదంలో అశోక వృక్షం పాత్ర

మన పరిసరాల్లోని ఆయుర్వేద వృక్షాల్లో అశోక వృక్షం ఒకటి. అశోక వృక్షం పేరు వినగానే రామాయణంలో సీతాదేవి గుర్తుకొస్తుంది. ఎందుకంటే సీతమ్మవారిని రావణుడు బంధించి అశోకవనంలోనే ఉంచాడు. అందుకే ఆ తర్వాత కాలంలో అశోకకు సీతాశోక అనే పేరు వచ్చింది. హనుమంతుడు సీతాదేవిని అశోకవృక్షం కిందనే కనుగొన్నాడు. గౌతమ బుద్ధుడు లుంబినీ వనంలో అశోకవృక్షం కిందే జన్మించాడు.

4-Mana-Aarogyam-795అంటే అర్థం అవుతుంది కదా, దీని ప్రత్యేకత. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ శోకం ఉండదు అంటారు. ఇది ఎక్కువగా శ్రీలంకలో, భారతదేశంలో పెరుగుతుంది. ఎత్తుగా, గుబురుగా పెరుగుతూ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని మొగ్గలు, పువ్వులు, కాయలు కూడా ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. పార్క్ లు కాలేజీలు మొదలైన ప్రాంతాల్లో అందం కోసం బాటకు ఇరువైపులా పెంచిన చెట్లలో అశోక వృక్షాలు కచ్చితంగా ఉంటాయి.

3-Mana-Aarogyam-795నిటారుగా పొడవుగా పెరిగిన ఈ అశోక చెట్లు ఆహ్లాదాన్ని మాత్రమే కాదు బోలెడు ఆరోగ్యాన్ని ప్రసాధిస్తాయని చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఈ వృక్షం బెర‌డు, ఆకులు, విత్త‌నాలు, పువ్వుల‌ను అనేక ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. అవి అనేక వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో స‌హాయ ప‌డ‌తాయి.

2-Mana-Aarogyam-795స్త్రీలలో జననేంద్రియ సమస్యలు మరియు ఋతు రుగ్మతల చికిత్సలో అశోక చెట్టు ప్రసిద్ది చెందింది. గతితప్పిన నెలసరి సమస్యలను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది. ఇది గర్భాశయ కండరాలు మరియు ఎండోమెట్రియంకు టానిక్‌గా పనిచేస్తుంది, కడుపులో అసమతుల్యతను మరియు కడుపు నొప్పిని నియంత్రిస్తుంది. డిస్మెనోరోయా, అమెనోరోయా, ల్యూకోరోయా, ఫైబ్రాయిడ్లు, ఊపిరితిత్తులు మరియు ఇతర సంబంధ జబ్బులకు ఉపశమనం గా ఉపయోగపడుతుంది.

అశోక చెట్టు నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంది దీనిని ఎలాంటి సందేహం లేకుండా ఉపయోగించవచ్చు. అది నొప్పుల‌ను త‌గ్గించే అనాల్జెసిక్ గా ప‌నిచేస్తుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు పరుస్తుంది. అశోక వృక్షం ఆకుల‌ను పేస్ట్‌లా చేసి శ‌రీర భాగాలపై రాస్తుంటే కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు త‌గ్గుతాయి. ఆ మిశ్ర‌మం విషానికి విరుగుడుగా కూడా ప‌నిచేస్తుంది.

6-Mana-Aarogyam-795అశోక వృక్షంలో సహజంగా చర్మం యొక్క రంగును మెరుగుపరిచే గుణం ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. చర్మ అలెర్జీల నివారణకు సహాయపడుతుంది. అంతేకాక, చెట్టు బెరడు కాలిన గాయాలు మరియు దురదలు తగ్గించడానికి ఉత్తమమైన ఎంపిక. ఈ చెట్టు బెరడును ఉపయోగించడం వల్ల ఫంగల్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు. బెరడు శరీరాన్ని శుద్ధిచేయడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

1-Mana-Aarogyam-795జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యానికి, గుండె సంర‌క్ష‌ణ‌కు, ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ ప‌నితీరుకు, విసర్జ‌న వ్య‌వ‌స్థ‌కు, శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను నియంత్రించేందుకు అవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అశోక చెట్టు పువ్వుల‌ను తీసుకుని న‌లిపి ర‌సం తీయాలి. దాన్ని అర టీస్పూన్ మోతాదులో కొద్దిగా నీటితో క‌లిపి తాగుతుండాలి. దీంతో ఇంట‌ర్న‌ల్ బ్లీడింగ్ త‌గ్గుతుంది. డ‌యేరియా నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అశోక చెట్టు విత్త‌నాల పొడిని కొద్దిగా తీసుకుని దాన్ని త‌మ‌ల‌పాకులో చుట్టి తింటుంటే ఆస్త‌మా తగ్గుతుంది. కిడ్నీ స్టోన్లు క‌రుగుతాయి.

5-Mana-Aarogyam-795మన శరీరంలో అంతర్గత రక్తస్రావం జరిగే సందర్భాలలో అశోక చెట్టు పూల సారం రక్తస్రావం ను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే విరేచనాలతో బాధపడుతున్నవారికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. విరేచనాల నివారణకు అశోక పుష్పాల పొడిని నీళ్లతో కలిపి తీసుకోవాలి. అదేవిధంగా, అశోక చెట్టు నుండి ఎండిన పువ్వులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సహాయపడతాయి. అశోక కషయాన్ని తీసుకోవడం వల్ల మధుమేహాన్ని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR