కళని కొందరు ఇష్టపడితే, కళ కొందరిని ఇష్టపడుతుంది; ఎలా అయితే కళని ఇష్టపడేవాళ్ళలో అన్ని ధన, జాతి, ప్రాంత, భాష, వయసు, వర్ణాల తారతమ్యం ఉండదో, కళ ఇష్టపడేవాళ్ళలో కూడా ఇలాంటి తారతమ్యం ఉండదు. ఇక ఈ కళ ఎన్ని రకాలుగా అయినా అవతారమెత్తుతుంది, తనకు నచ్చిన వారితో తమకు నచ్చినట్టు ఉంటుంది. బహుశా ఆ పుటల్లో నుండి వచ్చినవాడే ఈ దమరసింగి తరుణ్ అనుకుంటా! కళ ఇతన్ని PEN ART రూపంలో చేరితే, ఈ 19 ఏళ్ళ అనకాపల్లి కుర్రాడు దాన్ని ఊరు, రాష్ట్రం, దేశం దాటి ఖండాంతర స్థాయిలో కనిపించేలా గీస్తున్నాడు. ఈ Pen Art category లో మొదట్లో మనోళ్ళ వరకే మన్ననలు అందినా, తరువాత మనోడే అని అనుకునేంత గొప్ప స్థాయికి “2 సార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్”, “ఒకసారి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్” కొట్టి మరీ చేరుకున్నాడు. ఇంతకీ ఈ కుర్రాడు ఏం చదువుతున్నాడు అంటే, AP IIIT-RGUKT Srikakulam లో Civil Engineering 2nd Year. ఒకపక్క కళా ప్రతిభ కనబరుస్తూనే మరోపక్క Studies లో కూడా రఫ్ఫాడించాడని మనోడు చదివే చోటే చెప్తుంది. సరే ఇక కబుర్లు పక్కనపెడితే కుర్రాడి కిర్రాక్ Arts చూసేద్దాం…..
Instagram profile: https://instagram.com/tarunmegastar150?utm_medium=copy_link
1. Colour Pictures
2. Pen Sketches
3. Achievements – Some paper cuttings
“Jai Sramik”