బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకూడదు!

ఆరోగ్యంగా ఉండడం అంటే కేవలం పై పైన కనిపించేవే కాదు దంత, నోటి ఆరోగ్యం కూడా మన ఆరోగ్యంలో అంతర్భాగం. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.  పేలవమైన నోటి ఆరోగ్యం దంతాలలో కావిటీస్, చిగుళ్ల వ్యాధులకు దారితీస్తుంది. ఇది గుండె జబ్బులు, నోటి క్యాన్సర్, మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే దంతాలు మరియు చిగుళ్ల సంరక్షణ చాలా ముఖ్యం.
Brushing your teethబిజీగా ఉండటం వల్ల ప్రజలు తరచుగా రాత్రి పళ్ళు తోముకోరు, కానీ ఇది అతి పెద్ద తప్పు. నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యం. కొంత మంది బ్రష్ చేసుకొవడం 5 నిమిషాల్లో ముగిస్తారు. మరికొందరు ఎక్కవ టైం తీసుకుంటారు. అయితే పళ్లు శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే. కానీ, బ్రష్ చేసిన అనంతరం నోరు ఫ్రెష్‌గా ఉండేందుకు కూడా పుక్కిలిస్తుంటారు చాలామంది.
తిన్న తరువాత నోరు పుక్కిలించడం, నాలుకను శుభ్రం చేసుకోవడం మంచి అలవాటే. గ్లిజరిన్, కాటన్ ప్యాడ్‌ల సహాయంతో నాలుకను రోజుకు ఒకసారి శుభ్రం చేయండి. ఇది నాలుకను గులాబీ రంగులోకి మారుస్తుంది అలాగే, నోటి కుహరంలో బ్యాక్టీరియా పెరగదు. పత్తిపై గ్లిజరిన్ వేయడం ద్వారా నాలుకను శుభ్రం చేయొచ్చు. లేదా నాలుకపై గ్లిజరిన్ వేయడం ద్వారా కాటన్ ప్యాడ్‌తో తుడవొచ్చు.
ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ పళ్లు తోమిన వెంటనే ‘మౌత్ వాష్’ చేయడం ఎంత మాత్రం శ్రేయస్కారం కాదని ఆ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని  డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. బ్రష్ తర్వాత నోటిని పుక్కిలించడం దంతాల్లోని జీవ కణజాలం కుళ్లిపోయి దంతక్షయం ఏర్పడుతుందని, కాబట్టి వెంటనే ఆ అలవాటు మానుకోమని సూచిస్తున్నారు.
mouth wash
‘మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల దంతక్షయం నుంచి రక్షణ లభిస్తుంది. అయితే, బ్రష్ చేసిన తర్వాత మాత్రం దాన్ని వాడొద్దు. దానివల్ల దంతాలపై ఉండే టూత్ పేస్ట్ ఫ్లోరైడ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. మౌత్ వాష్‌లో ఉండే ఫ్లోరైడ్ రోజంతా తినే ఆహారంలోని క్రిముల నుంచి రక్షణ కల్పించలేదు. టూత్ పేస్టులో 1450pp ఫ్లోరైడ్ ఉంటుంది. మౌత్ వాష్‌లో 220pp ఫ్లోరైడ్ మాత్రమే ఉంటుంది.
Brushing your teethతక్కువ స్థాయిలో ఉండే ఫ్లోరైడ్.. తినే ఆహారం, తాగే పానీయాల్లో ఉండే చక్కెర వల్ల దంతాలకు కలిగే నష్టాన్ని అడ్డుకోలేదు. నోటిని మౌత్ వాష్‌తో శుభ్రం చేస్తే దంతాలపై గల ఫ్లోరైడ్ శాతం తగ్గిపోతుంది. కేవలంలో మౌత్ వాష్‌లో ఉండే తక్కువ స్థాయి ఫ్లోరైడ్ మాత్రమే మిగులుతుంది. ఆహారంలోని చక్కెర్లు దంతాల్లో తిష్ట వేస్తాయి. వాటిని తొలగించేందుకు మౌత్ వాష్ ఉపయోగపడుతుంది.
కాబట్టి బ్రష్ చేసిన వెంటనే కాకుండా మధ్యాహ్నం భోజనం తర్వాత మౌత్ వాష్ చేయడం మంచిది. భోజనం తిన్న తర్వాత ఆహారంలోని చక్కెర నోట్లో క్రమేనా ఆమ్లంగా మారుతుంది. తిన్న తర్వాత బ్రష్ చేస్తే ఆ ఆమ్లం నోరంతా చేరి PH స్థాయిలు తగ్గిస్తుంది. ఫ్లోరైడ్ మౌత్ వాష్ ఉపయోగించిన 30 నిమిషాల వరకు ఏమీ తాగొద్దు, తినొద్దు. దంతాలపై PH స్థాయిలు తగ్గిపోతే అరిగిపోతాయి. దీన్నే దంతాల కోత అని కూడా అంటారు.
రాత్రి భోజనం తర్వాత, నిద్రపోయే ముందు మౌత్ వాష్ చేసుకోవడం మంచిదే. 30 సెకన్ల పాటు మౌత్ వాష్ చేస్తే వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది. మౌత్ వాష్ లకి బదులు నోటిని శుభ్రం చేసుకోవడానికి సహజ పద్ధతులను వాడొచ్చు. తిన్న తరువాత ప్రతిసారీ 30 సెకన్ల పాటు నీటిని నోటిలో తిప్పండి. పుదీనా గ్రీన్ టీ మరియు గార్గెల్‌లో నిమ్మకాయ నూనెను కలిపి నోరు కడుక్కోండి. వేప ఆకులను నీటిలో మరిగించి, ఫిల్టర్ చేసి, మౌత్ వాష్‌గా వాడండి. ఉప్పు నీరు కూడా మంచి మౌత్ వాష్. గోరువెచ్చని నీటిలో ఉప్పుతో శుభ్రం చేసుకోండి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR