దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఈ సూచనలు తప్పక పాటించండి

ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అయినా సరే మన ఇంట్లో అమ్మమ్మ నో బామ్మనో ఉంటే దిష్టి తీసేయడం గుడికి తీసుకెళ్లడం లేదా దర్గా కి తీసుకెళ్లి తాయత్తు కట్టించడం లాంటివి చేస్తుంటారు. చిన్న పిల్లలు భయపడితే దేవుడి స్తోత్రాలు చదువుతారు. గాలి ధూళి సోకిందేమో అని అంటారు. ఈ రోజుల్లో ఎవరు ఇలాంటివి నమ్మరు కానీ అందులోనూ కొంతవరకు నిజాలు ఉన్నాయి అంటారు పెద్దవారు. దైవశక్తి ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు, భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోలు దగ్గర ఉంచుకోవడం, ఇతర పనులు చేస్తుంటారు.

దుష్ట శక్తుల

అయితే దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు, ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తే దుష్ట శక్తులే కాదు, అప్రతికూల శక్తులు కూడా దగ్గరకు రావు. దీంతో అదృష్టం కలసి వస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుంధాం…

స్వస్తిక్ :

దుష్ట శక్తులమన హిందు ధర్మంలో ఒక ముఖ్యమైన గుర్తు స్వస్తిక్.
ఇది సూర్యునికి, శక్తి సంకేతం. కాబట్టి, స్వస్తిక్ గుర్తును ఇంటి ప్రధాన ద్వారం లేదా గోడల మీద రాయాలి.

ఓం:

దుష్ట శక్తుల

ఏ దేవాలయానికి వెళ్లినా ఈ శబ్దం వినపడుతూ ఉంటుంది. ఏ దేవుడిని తలచుకున్నా మొదటిగా ఓం శబ్దాన్ని ఉచ్ఛరిస్తాం. ఓం అనే సంకేతం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన గుర్తు. ఓం గుర్తును ప్రధాన ద్వారం వద్ద రాయడం కానీ, లేదా ఇంట్లో ఓం శబ్ధంను వినిపించడం కానీ చేయాలి.

తులసి ఆకులు :

దుష్ట శక్తులతులసి ఆకులను కొన్నింటిని తీసుకుని వాటి నుంచి రసం తీయాలి. దాన్ని శుభ్రమైన మంచి నీటిలో కలపాలి. ఆ తరువాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవాన్ని ఇంట్లో చల్లాలి. దీంతో దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న అప్రతికూల శక్తులు బయటకు పోతాయి.

యజ్ఞం :

దుష్ట శక్తులకనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితులచేత యజ్ఞం చేయించాలి. దీంతో వారు చదివే మంత్రాలకు, యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్ట శక్తులు పారిపోతాయి. అంతా శుభమే జరుగుతుంది. అనుకూల శక్తి ఇంట్లోకి వస్తుంది. ధనాన్ని అది ఆకర్షిస్తుంది.

ధూపం :

దుష్ట శక్తులఇంట్లో అంతటా ప్రసరించేలా ధూపం వేయాలి. బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు పాత్ర తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాన్నుంచి వచ్చేపొగను ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు. అప్రతికూల శక్తి పోతుంది.

దీపం :

దుష్ట శక్తులరోజూ ఇంట్లో దీపం పెట్టడం స్నానం చేసిన తర్వాత రోజూ ఇంట్లో ఉదయం, సాయంత్రం వేళల్లో దీపం పెడితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.

ఇంటి ద్వారం శుద్ధి :

దుష్ట శక్తులకొద్దిగా జీలకర్ర, ఉప్పులను తీసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. తరువాత మిగిలిన తలుపులు, కిటికీల వద్ద కూడా ఆ మిశ్రమాన్ని చల్లితే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. అనుకూల శక్తి పెరుగుతుంది.

దానం :

దుష్ట శక్తులఇతరులకు సహాయం చేయడం, దాన, ధర్మాలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం వంటి పనులు చేసే వారిని దుష్ట శక్తులు బాధించవట.

రత్నాలు ఇంట్లో ఉంచాలి :

దుష్ట శక్తులసిలికా స్ఫటికం, టైగర్ ఐరన్ స్ఫటికం, పుష్యరాగం, గోమేధికం తదితర స్ఫటికాలు, రాళ్లలో వేటినైనా కొన్నింటిని తీసుకుని ఇంట్లో ప్రతి మూల, ప్రతి గదిలో పెట్టాలి. దీంతో దుష్టశక్తులు రావు. అప్రతికూల శక్తి పోతుంది.

ఇల్లు ఎల్లప్పుడూ సందడిగా ఆనందంగా ఉండాలి :

దుష్ట శక్తులపెద్దగా సౌండ్ పెట్టుకుని సంగీతాన్ని వినడం, ఇంట్లోకి గాలి, సూర్య కాంతి ధారాళంగా వచ్చేలా చేయడం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం, వినోదభరితమైన కార్యక్రమాలను ఇంట్లో చేస్తూ ఉంటే అనుకూల శక్తి వల్ల ఇంట్లో దుష్ట శక్తులు ఉండవు. ముక్యంగా రామ నామం, హనుమాన్ దండకం లాంటివి ఇంట్లో వినపడితే చాలా మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR