ఆశ్చర్యపరిచే చిన్ మస్తిక దేవి ధామ్ ఆలయ రహస్యాలు

ప్రముఖమైన శక్తి పీఠంగా విరాజిల్లె చిన్తపూర్ణి ఆలయం హిమాలయాలలోని పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రదేశం. 51శక్తి పీఠాలలో ఒకటి. ఎంతో మహిమల ఈ క్షేత్రానికి విశిష్టమైన చరిత్ర వుంది. ఇక్కడికి భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తుంటారు.

Mysteries of Chin Mastika Devi Dham Templeఈ శక్తిపీఠాలలలో పరాశక్తి తన భర్త అయిన భైరవునితో వెంట కాలభైరవుని తోడుగా కొలువై వుంటుంది. చింతపూర్ణి అంటే అమ్మవారి పాదాలు పడిన చోటు అని చెబుతారు. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో వుండదు. పిండి రూపం లో వుంటుంది. ఇక్కడకి వచ్చిన భక్తులు తమ చింతలు దూరం చేసే తల్లిగా కొలుస్తారు. ఈ సత్యం చాలా మందికి అనుభవ పూర్వకంగా రుజువైయింది.

Mysteries of Chin Mastika Devi Dham Templeస్థల పురాణాన్ని బట్టి ఈ కధ ప్రచారంలో వుంది. ‘మస్తిక’ అంటే శిరస్సు అని, ‘చిన్’ అంటే లేదు అని, అర్థం… శిరస్సు లేని దేవత గా ఇక్కడి మాతని కొలుస్తారు. ఇతిహాసాలలోని పురాణాల ప్రకారం మార్కండేయ పురాణం లో మరో గాధ కూడా ప్రచారంలో వుంది. చండి దేవికి రాక్షసులకి జరిగిన ఘోర యుద్ధం లో చండీ దేవి అసురుల్ని ఓడిస్తుంది. అందులో సాయపడిన ఢాకిని, యోగినిగా పిలువబడే జయ విజయులు ఏంతో మంది రాక్షసులని సంహరించి వారి రుధిరాన్ని తాగుతారు. కాని, యుద్దానంతరం కూడా వారు విపరీతమైన రక్త దాహంతో వున్నపుడు చండి దేవి తన తలని తానె ఖండించి తన శరీరం నుంచి వచ్చే రక్త దారాలతో వారి దాహాన్ని తీరుస్తుంది. అందుకే ఇక్కడి అమ్మవారు చిన్ మస్తికాదేవిగా అంటే శిరస్సు లేని దేవిగా పిలువబడుతోంది.

Mysteries of Chin Mastika Devi Dham Templeపురాణాలు, ఇతిహాసాలలో రుద్ర దేవుడు ఈ ప్రదేశాన్ని నలు దిక్కులా కాపాడుతుంటాడని కూడా వుంది. తూర్పున కాళేశ్వర్ మహాదేవుని ఆలయం, పశ్చిమాన నారాయణ్ మహాదేవ ఆలయం, ఉత్తరాన మచ్ కుండ్ మహాదేవ్ ఆలయం దక్షిణాన శివ్ బారి ఆలయం వున్నాయి. అందుకే ఆ ఆలయాన్ని చిన్ మస్తిక దేవి ధామ్ అని అంటారు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR