ఆంజనేయుడు రెండు ముఖాలతో దర్శనమిచ్చే ఏకైక ఆలయం

0
5962

ఆంజనేయస్వామి కొలువై ఉన్న ప్రసిద్ధ దేవాలయంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. అయితే ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ప్రకృతి సౌదర్యమైన కొండపైన సువిశాలమైన ప్రదేశంలో కొండగట్టు పైన ఆంజనేయస్వామి ఎలా వెలిసాడు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా నుండి 35 కి.మీ. దూరంలో చొప్పదండికి కి దగ్గరలో మల్యాల మండలం లో కొండగట్టు పై ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి దక్షిణాన కొండల రాయుని కోట, గుహలు, బొజ్జ పోతన, కండల రాయుని గుర్రపు, సీతమ్మ కన్నీటి గుంటలు కొండగట్టులో చూడదగిన ప్రదేశాలు.

kondagattu anjanna mahima

ఇక పురాణానికి వస్తే, ఈ దేవాలయం త్రేతాయుగానికి చెందినదిగా చెబుతారు. ఆ కాలం లో ఋషులు ఈ ప్రదేశం లో యజ్న యాగాలను నిర్వ హిస్తు ,తపస్సు చేసుకొంటూ గడిపేవారు. అయితే రామ రావణ యుద్ధం లో మూర్చ పోయిన లక్ష్మణ స్వామి మూర్చను పొగొట్టటానికి ఆంజనేయుడు సంజీవి పర్వతాన్ని పేక లించుకొని వస్తుండగా ,ఇక్కడి మహర్షులు ఆయన్ను సాదరం గా ఆహ్వానించారు. ఆయన వ్యవధి లేదని చెప్పి , తాను త్వరలోనే తిరిగి వస్తానని వాగ్దానం చేసి వెళ్ళి లక్ష్మణుని మూర్చ నుండి తేరుకోవటానికి సహాయ పడ్డాడు.

Kondagattu Anjaneya Swamy Temple

ఆ తరువాత ఎంతో కాలం ఇక్కడి మహర్షులు అంజనాసుతుని రాక కోసం వేయి కన్ను లతో ఎదురు చూశారు. కాని ఫలితం శూన్యం .అప్పుడు రుషులందరూ ఆలోచించి , గ్రహ నాదులకు శత్రువు అయిన భూత నాధుడైన భేతాళుడి ని ప్రతిష్ట చేశారు. అయినా హనుమ జాడ లేడు. ఋషులు చివరి ప్రయత్నం గా తమ ఉపాసనా, తపశ్శక్తులన్నిటినీ ధారపోశారు. అప్పుడు పవన సుత హనుమాన్ కరుణించి ఇక్కడ స్వయంభు గా వెలిశాడు . ఆ నాటి నుండి ఋషులు శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ , కీర్తిస్తూ , పూజిస్తూ నిర్విఘ్నం గా తపస్సు , యజ్న యాగాదులను నిర్వహించారు .

Kondagattu Anjaneya Swamy Temple

ఇక చారిత్రిక విషయానికి వస్తే , సుమారు 400సంవత్స రాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు కొడిమ్యాల పరగణా లో ఆవులను మేపు కొంటూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఒక ఆవు తప్పి పోయింది . దాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద నిద్ర పోయాడు . అప్పుడు స్వప్నం లో హనుమ కన్పించి తాను కోరంద పొదలో ఉన్నానని బయటికి తీసి ఎండకు, వానకు రక్షణ కల్పించమని , కోరి అతని ఆవు వెంటనే కనిపిస్తుందని చెప్పాడు. నిద్ర నుంచి సంజీవుడు ఉలిక్కి పడి లేచి, స్వామిని స్మరిస్తూ , ఆవు ను వెదకటానికి బయల్దేరాడు . అప్పుడు కోటి సూర్య ప్రభాభాస మానంగా సంజీవ రాయడు అతనికి సాక్షాత్కరించాడు. ఇంతలో దూరం నుండి ఆవు అంభా రావాల తో అక్కడికి చేరింది . సంజీవుడు చేతిలో ఉన్న గొడ్డలి తో కోరంద పొదను చేదించాడు . అక్కడ శంఖు ,చక్ర ,గదా ,లంకరణం తో విశ్వ రూపాత్మకుడైన పంచముఖాలలో ఒక టైన నారసింహ వక్త్రం తో ఉత్తరాభి ముఖం గా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి పరమానందంతో పరవశించి పోయాడు . తన అదృష్టానికి ముగ్ధుడై, మురిసి పోయాడు తరువాత తన స్నేహితులు బంధువులనందరిని తీసుకొని వచ్చి చూపించి , స్వామికి చేత నైనంత లో ఒక ఆలయాన్ని నిర్మించాడు .

Kondagattu Anjaneya Swamy Temple

ఇక్కడ స్వామి రెండు ముఖాతో వెలసిలి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత . ఇలా ద్విముఖ ఆంజనేయ మూర్తి ఇక్కడ మాత్రమే దర్శనం ఇస్తాడు. అంతేకాకుండా స్వామి సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక శంఖము , చక్రము , వక్షస్థలం లో శ్రీ రాముడు , సీతా సాధ్విలను కలిగి ఉండటం ఈ ఆలయంలో మరొక విశేషం. ఇంకా కొండ గట్టు ప్రాంతం అంతా అనేక రాళ్ళు , కొండలున్న ప్రదేశం . నల్ల రాయి ఇక్కడి ప్రత్యేకత . దట్టమైన అరణ్య ప్రాంతం చుట్టూ అనేక గుహలున్నాయి . అనేక రకాలయిన వృక్ష సమూహం తో ప్రకృతి అందానికి పట్టు గొమ్మ గా ఉంటుంది .

Kondagattu Anjaneya Swamy Temple

అయితే సంజీవ పర్వతాన్ని ఆంజనేయ స్వామి అరచేతిలో పెట్టుకొని వస్తుండగా , అందు లోంచి ఒక ముక్క రాలి కింద పడి ఈ పవిత్ర మైన కొండ గట్టు ఏర్పడిందని స్థానిక కధనం. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని160 ఏళ్ళ క్రితం శ్రీ కృష్ణా రావు దేశ్ ముఖ్ నిర్మించారు. ఇక్కడ స్త్రీలు నలభై రోజులు భక్తితోశ్రీ కొండ గట్టు ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే సత్సంతాన ప్రాప్తి కలుగు తుందని భక్తుల పూర్తి విశ్వాసం. ఈ ఆలయ సమీపంలో ఉన్న కొండల రాయ కోట, బోజ్జి పోతన గుహ భక్తులను విశేషం గా ఆకర్షిస్తాయి.

Kondagattu Anjaneya Swamy Temple

ఇలా కొండ గట్టు మీదే స్వామి వెలసి ఉన్నందున కొండ గట్టు శ్రీ ఆంజనేయ స్వామి అని భక్తులు ఆప్యాయం గా భక్తితో పిలుచు కొంటారు .