గరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి నీరు బొట్లు బొట్లు గా పడే ఆలయం

దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ శ్రీకృష్ణ, శ్రీ రామ ఆలయాలు ఒకే దగ్గర ఉండి విడివిడిగా ధ్వజస్తంభాలు, బలిపీఠాలు ఉండటం విశేషం. ఇంకా ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న గరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి నీరు బొట్లు బొట్లు గా పడుతూ ఉంటాయి. ఇలా గరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి నీరు బొట్లు బొట్లు గా పడటానికి హనుమంతుడే కారణం అని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? హనుమంతుడు గరుత్మంతుడి గర్వాన్ని ఎలా అణిచివేశాడనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Krishna Swamy‬ Templeఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరు అనే గ్రామంలో అళగుమల్లరి కృష్ణస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో జాంబవతి, సత్యభామ సమేత శ్రీ కృష్ణపరమాత్మ కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఎంతో మనోహరంగా ఉండటం వలన ఇక్కడ కొలువై ఉన్న స్వామిని అళగుమన్నారు అని పిలిచారు. తమిళంలో అళగు అంటే అందం అని అర్ధం. ఇలాంటి విశేషంగల దేవాలయం ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా కనబడదు.

Krishna Swamy‬ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, గరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి ఎప్పుడు నీరు కారుతూ ఉంటుంది. దీని వెనుక ఒక పురాణం ఉంది, శ్రీకృష్ణుడు ఈ క్షేత్రంలో జాంబవంతుడికి శ్రీరామచంద్రుడుగా దర్శనమిచ్చాడు. అప్పుడు హనుమంతుడుని కూడా పిలుచుకు రమ్మని స్వామి గరుత్మంతుడిని పంపించాడు. తనంతటి బలశాలి లేడనే గర్వంతో గరుడుడు, హనుమంతుడి ధ్యానానికి భంగం కలిగించాడట.

Krishna Swamy‬రామనామ స్మరణకి భంగం కలిగించిన గరుడినిపై హనుమ కోపంతో చేయి చేసుకుంటాడు. హనుమంతుడు కొట్టిన ఆ దెబ్బకి ఆయన ముందు తాను ఎంత బలహీనుడననేది గరుడినికి అర్థమైంది. ఆ తరువాత విషయం తెలుసుకున్న హనుమ ఆయనని అనుసరించి ఇక్కడికి వచ్చాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒక చెంప వాచినట్టుగా ఉండి కంటి నుండి నీరు వస్తుంది అని  స్థల పురాణం చెబుతుంది.

Krishna Swamy‬ఇక ఈ ఆలయంలో 9 అడుగుల ఎత్తు గరుత్మంతుని విగ్రహం, తొమ్మిదిన్నర అడుగుల ఎత్తు జాంబవంతుడు, సుగ్రీవ జటాయువుల విగ్రహాలు ఉన్నాయి. శ్రీకృష్ణ – జాంబవంతుల మధ్య మల్లయుద్ధం జరిగింది ఈ ప్రాంతంలోనే అని పురాణ ఇతిహాసం. ఈ ఆలయం 10 వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మించినట్లు తెలియుచున్నది.

Krishna Swamy‬ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు కృష్టాష్టమి మరియు పర్వదినాలలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR