ఈ ఆలయంలోని నంది నోటి నుండి వచ్చే నీరే కృష్ణానదిగా మారిందా?

0
3984

దక్షిణభారతదేశంలో రెండవ పెద్దనది కృష్ణానది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, మహాదేవ్ పర్వత శ్రేణిలో కృష్ణానది జన్మించింది. అయితే ఈ నది జన్మస్థలాన్ని పంచగంగ అని అంటారు. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఐదు నదులకు జన్మస్థలంగా చెబుతారు. అంతేకాకుండా పర్వతశ్రేణిలో ఒక ఆలయంలో ఉన్న నంది నోటి నుండి వచ్చే నీరే కృష్ణానదిగా జన్మించినదని, ఇక్కడే శివుడి, శ్రీకృష్ణుడి ఆలయాలు ఉన్నవి. మరి ఈ కృష్ణానది, ఇక్కడ ఉన్న ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Krishna Riverమహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా ఉన్న మహాదేవ్ పర్వత శ్రేణిలో కృష్ణానది జన్మించగా, చిన్నధారగ మొదలై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక తరువాత ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించి దివిసీమలో బంగాళాఖాతంలో కృష్ణనది కలుస్తుంది. భారతదేశంలో నాలుగవ పెద్ద నదిగా చెప్పబడే కృష్ణానది మొత్తం పొడవు 1400 కీ.మీ. ఇక కృష్ణానదిని తెలుగు ప్రజలు కృష్ణవేణిగా పిలుచుకోగా, మహారాష్ట్రలో కృష్ణానది జన్మించిన స్థలంలోనే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కృష్ణబాయి ఆలయమని పిలుస్తారు. అయితే 17 వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి కొలువై ఉన్నాడు.

Krishna Riverఇక్కడే మహాదేవుని ఆలయం ఉంది. ఇక్కడే వెన్న, సావిత్రి, గాయత్రీ, క్వయిన అనే నదులతో కలిపి మొత్తం ఐదు నదులు ఇక్కడే జన్మించినట్లుగా చెబుతారు. అయితే వెన్నానది కొంత దూరం ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణ, వెన్నా ఈ రెండు నదులు కలసి కృష్ణవేణి నదిగా ముందుకు ప్రవహించగా, కోయినానది మహాబలేశ్వర్ కొండల్లో పుట్టి అందులో ఒక పాయ మహాబలేశ్వర్ వైపు వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడే గోముఖం నుండి ఎప్పుడు నీరు అనేది వస్తుంటుంది. ఇక్కడ గోముఖం నుండి వచ్చే నీరే ఐదు నదులకు ప్రతిరూపమని చెబుతారు.

Krishna Riverఇక కృష్ణానది జన్మించిన స్థానం ఒక కొండ మొదలులోనే ఒక ఎత్తైన చోట కొండ అంచు ఉంది. ఇది ఇలా ఉంటె ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఐదు తూములు లాంటి రంద్రాలు ఉండగా, ఇవి ఒకదానికి ఒకటి ఆరు అగుడుల దూరంలో ఉన్నాయి. ఈ ఒక్కో రంద్రం గుండా నీరు ఎపుడు వస్తూ ఉంటుంది. అయితే ఈ ఐదు నదులు ఆలయానికి వెనుకవైపు ఉన్న కొండమీద నుండి ప్రవహిస్తూ వస్తూ, ఈ రంద్రాల గుండా కాలువలోకి చేరి ఒకే నదిగా ప్రవహిస్తాయి. అదే కృష్ణానదిగా ప్రవహిస్తుంది. దీనినే పంచగంగ అని అంటారు.

Krishna River

 

SHARE