మెడ చుట్టూ నలుపును తగ్గించే సహజ సిద్ధమైన ప్యాక్స్ ఏంటో తెలుసా ?

అందం అంటే ఎంతసేపూ ముఖానికి మెరుగులు దిద్దుతామే కానీ మెడభాగాన్ని అంతగా శ్రద్ధ చూపించము. వాతావరణ కాలుష్యం, ఎండ, పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో మెడ భాగంలో చర్మం నల్లగా మారుతుంది. దీన్నే ఫిగ్మింటేషన్ అంటారు. ఈ సమస్య వస్తే సాధారణంగా తగ్గదు.

Tips for removing pigmentationకాని కొన్ని సహజసిద్ధమైన ప్యాక్స్ వాడి మెడ చుట్టూ నలుపును తగ్గించుకోవచ్చు. ఈ పాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మరి అవేమిటో తెలుసుకుందామా.

Tips for removing pigmentationమెడ నలుపును తగ్గించటంలో కొబ్బరిపాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కొబ్బరిపాలలో కాటన్ ముంచి మెడ నల్లని భాగంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

Tips for removing pigmentationబియ్యంపిండిలో చర్మాన్ని తెల్లగా మార్చే గుణాలు అధికంగా ఉన్నాయి. బియ్యంపిండిలో కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి 15 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మెడ నలుపు తొలగిపోతుంది.

Tips for removing pigmentationగంధం పొడిలో విటమిన్స్, న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉండుట వలన మెడ నలుపును తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. గంధం పొడిలో నీటిని కలిపి నలుపు ఉన్న ప్రాంతంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR