దంపతులు మధ్య సఖ్యతను నేలకొలిపే అనంత పద్మనాభుని నోము

మనం చాలా రకాల నోముల గురించి విన్నాం, ఆచరించాం కూడా. కానీ అనంత పద్మనాభ స్వామి వారి నోము గురించి విన్నారా ? అయితే ఈ నోము విశిష్టత ఏంటో చూద్దాం.

పూర్వకాలంలో ఒక గ్రామంలో నిరుపేద దంపతులుండేవారు. వారికొక కుమార్తె వుండేది ఆమెను అల్లారుముద్దుగా పెంచి చదువు సంధ్యలు నేర్పించారు. యుక్త వయస్సు వచ్చిన కుమార్తెకు వివాహం చెయ్యాలని కాలినడకన దూర తీర గ్రామాలకు వెళ్లి చక్కని వరుణ్ణి నిశ్చయించారు. వివాహం చేసి ఆమెను అత్తవారింటికి సాగనంపారు. కమార్తె అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇచ్చి పంపించమని భార్యకు చెప్పాడు. ఆ ఇల్లాలు ఇంట్లో వున్న కాస్త వరిపిందిని మూటగట్టి కూతురుకిచ్చింది.

Anantha Padmanabhu swamyనవవదూవరులిద్దరూ వారి స్వగ్రామానికి కాళీ నడకన బయలుదేరారు. వెళ్తూ మార్గ మధ్యలో సంధ్యా వందనం చేయడానికి ఆమె భర్త చెరువుకు వెళ్ళాడు. ఈ లోపున నవవధువు ఆ చుట్టు పక్కల తిరుగుతూ కొందరు పూజచేసుకుంటూ వుండడం చూసింది. వారి దగ్గరకు వెళ్లి ఆ పూజ వివరాలను అడిగి తెలుసుకుంది. తన దగ్గర వున్న పిండితో పద్మనాభుని బొమ్మను చేసి చెట్టు మొదలు దగ్గర ప్రతిష్టించుకుని భక్తితో పూజ చేసింది. భర్త వచ్చే సరికి ఆమె పూజ ముగించుకుంది.

Anantha Padmanabhu swamyభర్త తోపాటు గ్రామానికి బయలు దేరింది మార్గ మధ్యలో వారికి ఆకలికాగా ఆమె భర్త తన అత్తా గారిచ్చిన పిండితో తినడానికి ఏమైనా చెయ్యమని అడిగాడు. అందుకామె పిండిలేదని బొమ్మను చేసి పూజచేసుకున్న వైనాన్ని చెప్పి చేతికి ఉన్న తోరణాలను సాక్ష్యంగా చూపింది. అతడు విసుక్కొని ఆతోరణం తీసిపారేయ్యమన్నాడు. ఎదురు చెప్పలేక చేతికున్న దారపు పోగులను తీసేసింది.

Anantha Padmanabhu swamyనోము వుల్లన్ఘిన్చినట్లయింది. వారి ప్రయాణం దుర్భరమైంది. ఆకలి ఎక్కువైపోయింది. ఎందుకు ఇలా అవుతుందని ఆ వరుడు చాలా పరితపించాడు. ఇదంతా తోరణం తీసి పారేసి పద్మనాబుని వ్రత ఉల్లంఘన చేయడం వల్లనే జరిగి ఉంటుందని అనుకుని అనుమతిస్తే మళ్ళీ ఆ వ్రతం మొదలు పెట్టి భక్తి శ్రద్దలతో పూర్తి చేస్తాను మన బాధలు తొలగి పోతాయి అంది.

Anantha Padmanabhu swamyఅందుకు అతడు అంగీకరించాడు, ఆ వధూవరులు మరింత భక్తి శ్రద్దలతో స్వామికి నివేదించవలసిన పూజాద్రవ్యాలను పూజా విధి విధానాలను అనుసరించి మనసులో తలచు కుంటూ అనంత పద్మనాభుని వ్రతం చేసారు. స్వామీ అనుగ్రహం కలిగి ఆ వ్రత మహిమ వల్ల ప్రయాణం సుఖంగా సాగింది. చెట్ల ఫలాలు లభించగా వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు. ఇంటికి చేరుకునేసరికి రాజుగారి ఆస్థానం నుండి రాజ పురోహితునిగా రావాలని ఆహ్వానం వచ్చింది. తరువాత ఆ దంపతులకు జీవితం ఆనందంగా సాగింది.

Anantha Padmanabhu swamyఉద్యాపన: వార్షికంగా ఈ నోము కన్యలు, వివాహిత వనితలు చేసుకోదగినది. పిండితో దామోదరుని బొమ్మను చేసి ప్రీతితో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. ఆ రోజున ఒక సద్బ్రాహ్మనునికి భోజం పెట్టి దక్షిణ తాంబూలాలివ్వాలి. అంతటితో వ్రతం పూర్తి అవుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR