ముక్కు నుండి రక్తం కారుతుందా ఈ చిట్కాలు పాటించండి!

చాలామందిలో ఆకస్మాత్తుగా ముక్కు నుండి రక్తం కారడం జరుగుతూ ఉంటుంది. ఎండాకాలంలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఇది తరచుగా కనిపించే లక్షణం. ఈ సమస్యను ఎపిస్టాక్సిస్ అంటారు. ముక్కులో సున్నితంగా ఉండే నాసికా పోరలు డ్రై కావడం వల్ల రక్తం కారుతుంది. ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల కూడా నాసికా పొరలకు గాయమై రక్తం వస్తుంది.

2-Mana-Aarogyam-785అలాగే మానవుల ముక్కులో చాలా ఎక్కువ రక్తనాళాలు ఉంటాయి. అందుకే జీవితంలో ప్రతి ఒక్కరికీ కనీసం ఒక్కసారైనా ముక్కు నుంచి రక్తం వస్తుంది. ఎండాకాలంలో సాధారణంగా ముక్కు లోపల ఉండే మ్యూకస్‌ పొరలు ఎండిపోయినట్టుగా మారుతుంది. అక్కడి చర్మం పగిలినట్టయి రక్తం వస్తుంది. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్స్‌ వాటిల్లినప్పుడు ముక్కు నుంచి రక్తం కారుతుంది. సైనసైటిస్‌ కూడా రక్తస్రావానికి కారణమవుతుంది.

5-Mana-Aarogyam-785అధిక రక్తపోటు వల్ల కూడా ముక్కు నుంచి రక్తం కారడం తీవ్రమవుతుంది. అధికరక్తపోటు ఉండటం వల్ల సహజంగానే రక్తంలో కొవ్వు నిల్వలు ఎక్కువగానే ఉంటాయి. ఈ కొవ్వు నిల్వలను కరిగించడానికి వాడే మందుల వల్ల రక్తం పలచన అవుతుంది. ఇటువంటి వాళ్లు ఈ మందులను ఆపేస్తే గుండెపోటు వచ్చి మరణించే అవకాశముంది. ఈ మందులను వాడే వ్యక్తులు ముక్కుకు గాయాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి.

4-Mana-Aarogyam-785అయితే ఈ రక్తాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ రక్తానికి అడ్డుకట్టే ఔషదం మన వంటింట్లోనే ఉంది. కొంచెం పటిక బెల్లాన్ని తీసుకొని.. దాన్ని నీటిలో కలిపి వెంటనే తాగేస్తే ముక్కు నుంచి రక్తం కారడం ఆగిపోతుంది. పటిక బెల్లం వల్ల తక్షణ శక్తి వస్తుంది. ఒత్తిడికి గురయ్యే నరాలకు ఉపశమనం కలిగించేందుకు తులసి రసం తోడ్పడుతుంది. ముక్కు నుంచి రక్తం కారితే.. రెండు చుక్కల తులసి రసాన్ని వేయాలి.

ఉల్లికి రక్తాన్ని గడ్డకట్టించే స్వభావం ఉంది. ఉల్లితో విటమిన్-సి లభించడంతోపాటు రక్త కేశ నాళికలను బలోపేతం చేస్తాయి. ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లయితే.. ఉల్లిపాయను కత్తిరించి ఒక ముక్కను ముక్కు వద్ద ఉంచి వాసన చూడండి. ఇలా కొద్ది సేపు చేస్తే రక్తం కారడం ఆగిపోతుంది. లేదా విటమిన్ -ఇ ఆయిల్‌ను కొద్దిగా దూదిపై వేసి ముక్కు పొరలకు రాయండి. లేదా పెట్రోలియం జెల్లీ కూడా రాయవచ్చు

కొత్తిమీర చల్లదనంతో పాటు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఎలర్జీని నివారించే సహజ సిద్ధమైన ఔషదం కూడా. ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లయితే.. 2-3 చుక్కల కొత్తిమీర రసాన్ని ముక్కులో వేయాలి. దీనివల్ల రక్తం కారడం ఆగడంతోపాటు ఎలర్జీ వల్ల ముక్కు పొరలు పగిలే సమస్యను తగ్గిస్తుంది.

1-Mana-Aarogyam-785వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తస్రావమైనప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలి. కింద కూర్చొని ముక్కు మెత్తటి భాగాన్ని 10-15 నిమిషాల పాటు నొక్కి పెట్టి ఉంచాలి. నెమ్మదిగా నోటితో గాలి పీల్చాలి. ముక్కు మీద ఒక మంచు ముక్కను ఉంచాలి. రక్తస్రావం ఇంకా ఆగకపోతే ఒత్తిడి తగ్గించి తిరిగి మళ్లీ కలుగజేయాలి. ముక్కు లోపల తేమ ఆరిపోకుండా జాగ్రత్త వహించాలి. రాత్రి పడుకునే ముందు హ్యుమిడిఫియర్‌, వెపోరైజర్‌ వాడాలి. ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చినప్పుడు యాంటీబయోటిక్స్‌ మందులు వాడాలి.

ముక్కు నుంచి రక్తం కారడంతో పాటుగా కొన్ని ఇతర లక్షణాలు ఉన్నప్పుడు ఈ సమస్య ప్రమాదకరం కావచ్చు. రక్తపోటు ఉన్నవారు, హీమోఫీలియా వంటి సమస్యలు ఉన్నప్పుడు, ఎనీమియా లక్షణాలు కనిపించినప్పుడు, గుండె దడ, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

6-Mana-Aarogyam-785

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR