శని దోషం పడితే… ఎన్నో సమస్యలొస్తాయి. కోరిన కోరికలు తీరవు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాల వంటివి ఎదుర్కొంటారు. కోర్టు కేసులు తేలవు, శత్రువులు పెరుగుతారు, రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలుంటాయి. సాదారణంగా శని గురించి తెలిసిన వారు చాలా జాగ్రత్తగానే ఉంటారు.
- అయితే కొంత మందికి శనీశ్వరుణ్ణి ఇంటిలో పూజగదిలో పెట్టి పూజించవచ్చా అనే సందేహం వస్తుంది. శనీశ్వరుణ్ణి ఇంటిలో పూజగదిలో పెట్టి అసలు పూజ చేయకూడదని పండితులు చెప్పుతున్నారు.
- అసలు శనితో పాటుగా ఏ నవగ్రహాలను ఇంటిలో పూజించే సాంప్రదాయం పూర్వ కాలం నుండి కూడా లేదు. కొన్ని పురాతన దేవాలయాలలో నవగ్రహాలు ఉండవు. దాదాపుగా 200 సంవత్సరాల నాటి గుడిలో నుంచి మాత్రమే నవగ్రహాలు ఉంటున్నాయి.
- నవగ్రహాలకు ఆ దేవదేవుడు ఆదేశించే పనులను మాత్రమే చేయటానికి ఆదేశం ఉంది. కాబట్టి నవగ్రహాల కారణంగా వచ్చే ఇబ్బందులను తొలగించుకోవడానికి ఆ దేవదేవుని పూజించాలి.
- అంతేకాని నవగ్రహాలను పూజించకూడదు. అయినా సరే మన పండితులు ఆయా గ్రహాల దోష నివారణకు పరిహారాలు, పూజలు, ప్రదక్షిణాలు చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఇంటిలో నవగ్రహాలకు పూజ చేయవలసిన అవసరం లేదు.
- ఒకవేళ చేయాలని అనుకుంటే మాత్రం ఆగమ శాస్త్రం ప్రకారం హోమాలు చేశాకే. దీపారాధన చేసి దీపజ్యోతిలో నవగ్రహాలను ఆవాహన చేసుకుని ఆ తరవాత మాత్రమే పూజించాలి. కానీ జ్యోతిష్య నిపుణులు మాత్రం ఇంటిలో నవగ్రహాలకు పూజ చేయటం మంచిది కాదని ఆ పూజలు గుడిలో మాత్రమే చేయాలనీ చెప్పుతున్నారు. పొరపాటున ఈ పనులు చేస్తే దురదృష్టం మీవెంటే.. కుటుంబంలో అభివృద్ధి ఉండదు!