బెండకాయ తిన్నప్పుడు ఇవి తింటే మరణిస్తారా?

మార్కెట్ కి వెళ్లి వారానికి సరిపడా కూరగాయలు తెచుకున్నప్పుడు అందులో కచ్చితంగా బెండకాయ ఉంటుంది. ఎందుకంటే బెండకాయ కేవలం వంటల్లోనే కాదు… దివ్యమైన ఔషధంగానూ ఉపయోగడుతుంది. ముఖ్యంగా శాఖాహారులకైతే ఇది ఒక మాంసాహారం లాంటిది. ఇందులో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, రాగి మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

okra on treeఅందుకే వైద్యులు బెండకాయ తినమని సలహా ఇస్తారు. బెండ ఒక పచ్చి కూరగాయ. అందువల్ల ఇది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బెండకాయలోని లెక్టిన్‌ అనే ప్రొటీన్‌ రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకొంటాయి. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. ఈ గింజల్లోని పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇందులోని కె-విటమిన్‌ ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది.

fresh okra seedsబెండలోని మ్యూకస్‌ వంటి పదార్థం కడుపులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మ్యూకస్‌ గ్యాస్ర్టిక్‌, ఎసిడిటీ సమస్యలకు చక్కని పరిష్కారం. దీన్లోని డయూరిటిక్‌ లక్షణాలు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ని నయం చేయడంలో సహకరిస్తాయి. బెండలోని పెక్టిన్‌… బ్లడ్‌ కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తుంది. విటమిన్‌-సి ఆస్తమా తదితర శ్వాసకోశ సమస్యల్ని దూరంగా పెడుతుంది. బెండకాయ డికాక్షన్‌ తాగితే జ్వరం తగ్గుతుంది. అయితే బెండలో ఫ్రక్టేన్లూ, ఆక్సలేట్లూ, సొలమిన్లు ఉండడంవల్ల మొలలూ, మూత్రపిండ వ్యాధులు, కీళ్ల నొప్పులున్నవాళ్లు తగు మోతాదులో తీసుకోవాలి.

కానీ ఎంతటి దివ్యఔషధమైనా కొన్నిసార్లు మనం చేసే తప్పుల కారణంగా అది మనకు విషం కూడా కావచ్చు. అందుకే బెండకాయ కూరతో భోజనం చేశాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. బెండకాయ కూరతో భోజనం చేశాక మనం చాలా కూరగాయలు తింటాం. అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా బెండకాయ తిన్న తర్వాత ముల్లంగిని వెంటనే తినవద్దు. అంతేకాదు మహిళలు బెండకాయను, ముల్లంగితో పాటు సలాడ్ రూపంలో తీసుకుంటే చర్మ సమస్యలను కలిగిస్తుంది.

okra and raddishముల్లంగిని, బెండకాయతో తీసుకుంటే ముఖంపై మరకలు ఏర్పడుతాయి. వాటికి ఎంత చికిత్స తీసుకున్నా అవి పోవు. ముల్లంగిని బెండకాయతో కలిపి తీసుకుంటే ముఖంపై దద్దుర్ల సమస్య కూడా వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అలాగే బెండకాయ తిన్న తర్వాత చేదు పదార్థాలు, కూరగాయలు ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే కడుపులోకి వెళ్లిన తర్వాత అది విషంగా మారుతుంది. అప్పుడు మరణించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల బెండకాయ తిన్న తర్వాత చేదుతో కూడిన పదార్థాలు అస్సలు తినకూడదు.

okra juiceఇక వేసవి కాలంలో బెండకాయలు, కాకర కాయలు మార్కెట్‌లో లభిస్తాయి. కొంతమందికి ఈ రెండు కూరగాయలంటే ఇష్టం. అయితే.. బెండకాయను, కాకర కాయను ఎప్పుడూ కలిపి తినకూడదు. ఈ రెండూ కలిపి తినడం వల్ల శరీరంలో విషం తయారవుతుంది. అది ప్రాణాంతకంగా పరిస్థితిని కలిగిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR