శ్రీరామానుజుల శరీరం వెయ్యేళ్లుగా ఉంటున్నా ఆలయం ఎక్కడ వుంది ?

హిందూ సంప్రదాయ పవిత్రతకు ప్రతిరూపం 1000ఏళ్లుగా భద్రపరిచిన రామానుజాచార్యుని శరీరం. రామానుజాచార్యుడు విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి దేవునిపై చూపవలసిన నమ్మకానికీ సాటిలేని భక్తికీ రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.

sri ramanujacharyaచరిత్రకారుల ప్రకారం, రామానుజాచార్యులు క్రీ.శ. 1017 – 1137 సంవత్సరాల మధ్య తన జీవితాన్ని కొనసాగించాడు. దీని ప్రకారం ఆచార్యుల జీవితకాల వ్యవధి నూట ఇరవై సంవత్సరాలు (120 సం.) సాంప్రదాయక ఆధారాల ప్రకారం రామానుజాచార్యులు తమిళ ‘పింగళ’ సంవత్సరంలో జన్మించి, మరో ‘పింగళ’ సంవత్సరంలో పరమపదించారు. తమిళ కాలమానం ప్రకారం ఒకే పేరుగల సంవత్సరం మళ్ళీ రావటానికి అరవై సంవత్సరాల కాలం పడుతుంది. దీన్ని బట్టి రామానుజాచార్యుల జీవితం అరవై లేక నూట ఇరవై సంవత్సరాలు ఉండవచ్చని మనం భావించవచ్చు.

srirangamసాధారణంగా ఒక మనిషి మరణిస్తే శరీరం కొద్ది రోజులకు కుళ్లిపోయి నశిస్తుంది. కానీ శ్రీరామానుజాచార్యుల శరీరం మాత్రం జ్ఞాన కాంతులతో ఇప్పటికీ వెలిగిపోతూ కనిపిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూడాలనుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగానికి వెళ్లాల్సిందే. అవును పరమ పవిత్రమైన శ్రీరంగం క్షేత్రంలోనే రామానుజాచార్యుల శరీరం ఉంది. సాధారణంగా ఈ ఆలయానికి వెళ్లే చాలా మందికి అక్కడ భగవత్ రామానుజుల శరీరం ఉందని తెలియదు.

sri ramanujacharyaకొందరు శ్రీరంగంలోని 4 వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా… అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు.

sri ramanujacharyaఅందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా చూడవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR