ఆశ్చర్యానికి గురిచేసే ప్రత్యేకమైన హిందూదేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

భారతదేశంలో సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తుంటారు. అందులోనూ హిందుమతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ముఖ్యంగా సాంప్రదాయాలకు పట్టుకొమ్మవంటివి దేవాలయాలు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో రెండు వేరువేరు రకాల శైలిలో దేవాలయాల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ దేవాలయాల రూపకల్పన ద్రవిడ శైలిలో ఉంటుంది. అందుకే ఇక్కడ ఆలయాలను చూసేందుకు ఏటా వేల సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలివస్తుంటారు. దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు ద్రవిడ, విజయనగర శైలి నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి. అందులోనూ ఎక్కువగా దేవాలయాలను ఇసుకరాయి, సబ్బు రాయి మరియు గ్రానైట్‌తో నిర్మించారు. ఇక్కడి దేవాలయాలు అందమైనవి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక, ఇతిహాస గాథాలను కూడా ప్రస్ఫూటకరిస్తాయి. అంతేకాదు పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు, గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు. అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉండేది. ఉదాహరణకు కొన్ని చూద్దాం.

కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది. ఒక స్తంభం నుంచి చూస్తే వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది. కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉన్నట్టు చెక్కబడివుంది.ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంభం నుంచి చూస్తే శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంభం నుంచి చూస్తే వాలిసుగ్రీవుల యుద్ధం చాల బాగా తెలుస్తుంది.

ఐరావతేశ్వరస్వామిఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.

ధర్మపురి(తమిళనాడు)

మల్లికార్జునస్వామి కోవెలలో వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభాల మంటపం అన్నమాట. ఇందులో రెండు స్థంభాలు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి.

ఐరావతేశ్వరస్వామికుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది. అక్కడ గరుడవాహనం రాతితో చేయబడి స్వామి సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు వుంటుంది. కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది. మరియు గుడిలోకి పోతున్నప్పుడు అదేవిధంగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహానికి చెమటపట్టడం కూడా ఒకవిచిత్రమే.

oldest temples in our countryకరూర్(కోయంబత్తూర్): కోయంబత్తూర్ సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రహాలు ఒకే మండపంలో ప్రతిష్ట గావించబడి వున్నాయి. చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది. అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు, పంచలోహవిగ్రహం కాదు కేవలం కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది. ఆశ్చర్యం కదా.

oldest temples in our countryతిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒకబిల్వచెట్టు స్థలవృక్షంగా వుంది. ఆ చెట్టులో కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి.

oldest temples in our countryకుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది. అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడి కోవెల అని పిలుస్తారు. విరుదునగర్ ప్రక్కన ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.

oldest temples in our countryఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమంలో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని పాదాలు ఒకే ఎత్తులో వుండడం

oldest temples in our countryవేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒకస్థంభంలో అర్ధచంద్రాకారంగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరునుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది. పైన వుండే పల్లం నుండి మనం ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం. గడియారం చూసుకో ఖ్ఖర లేదు.

oldest temples in our countryచెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి గుడిలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.

oldest temples in our countryధర్మపురి(తమిళనాడు)పక్కన పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామి అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపంతో ఉంటారు. ఇలా మనకు తెలియని, తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR