పురుష గ్రామదేవతలు ఎవరు? ఎక్కడలేని విధంగా పురుష గ్రామదేవతలు ఎక్కడ ఉన్నారు

మన దేశంలో ప్రతి గ్రామానికి గ్రామదేవత ఉంటుంది. తమకి ఎలాంటి ఆపదలు రాకుండా, దుష్ట శక్తి నుండి కాపాడుతుందని భక్తులు గ్రామదేవత ని పూజిస్తుంటారు. దాదాపుగా ప్రతి గ్రామంలో ఉరి చివరనే గ్రామదేవత ఆలయాలు అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఎక్కడలేని విధంగా పురుష గ్రామదేవతలు ఉన్నారు. మరి ఆ పురుష గ్రామదేవతలు ఎవరు? ఎక్కడ ఉన్నారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Goddess Appears As Male Gods

తమిళనాడు రాష్ట్రంలో అయ్యన్నార్ ఆలయం ఉంది. అయ్యన్నార్ అంటే అయ్యగారు అని అర్ధం. ఈ గ్రామంలోని గ్రామదేవతలను నిమ్న కులాలకు చెందిన వారు ఆరాధిస్తున్నారు. ఇక్కడి అయ్యన్నార్ గుర్రాన్ని అధిష్టించి, చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటాడు. ఈయన గ్రామాన్ని ఎప్పుడు రక్షిస్తుంటాడని ఇక్కడి స్థానిక భక్తుల నమ్మకం.

వీరన్ ఆలయం :

Goddess Appears As Male Gods

తమిళనాడులోని మధురై జిల్లాలో ఒక ప్రాంతంలో మధురై వీరన్ అనే ఒక పురుష గ్రామదేవతగా భక్తులు కొలుస్తున్నారు. అయితే మహా బలవంతుడు అయినా మధురై వీరన్ చేయని నేరానికి, రాజగ్రహానికి గురై మరణం పొందినవారు హఠాత్తుగా ఏదో ఒక రూపంలో వారి ఉనికిని నిరూపించుకోవడానికి ఇలా అవతరిస్తారని ఇక్కడి వారు నమ్ముతారు.

కరుప్పుస్వామి ఆలయం:

Goddess Appears As Male Gods

కరుప్పుస్వామి అంటే నల్లని దేవుడని అర్ధం. తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలలో ఈయనని పేదలకు న్యాయాన్ని ప్రసాదించే దేవుడిగా కొలుస్తారు. ఏదైనా తప్పు చేస్తే అసలు క్షమించకుండా కఠినంగా శిక్షిస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ స్వామి వైష్ణవ సంబంధమైన గ్రామదేవత అని చెబుతారు. తేత్రాయుగం నాటి రామాయణ కాలంలో కరుప్పుస్వామి వెలిశాడని చెబుతారు. అయితే శ్రీరాముడు కుశునికి కురప్పస్వామి నల్లనివాడు అనే బిరుదును ఇచ్చి ముఖం పైన తిరునామాలు అద్ది తన అంగరక్షకుడిగా నియమించుకున్నాడని, కుశుని అవతారమే కురప్పస్వామి అంటూ పురాణం.

ఈవిధంగా తమిళనాడు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో అయ్యన్నార్, వీరన్, కురప్పస్వామి వంటి వారిని అక్కడి స్థానికులు పురుష గ్రామదేవతలుగా కొలుస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR