బొబ్బిలి రాజుల ఆరాధ్యదేవత పాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయ విశేషాలు

శ్రీకాకుళం ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. ఈ జిల్లా బంగాళాఖాతం ఒడ్డున ఉంది. ఈ ప్రదేశాన్ని సిక్కోలు అని కూడా పిలుస్తారు. సికాకుళం అనేది కూడా ఈ ప్రదేశాన్నే!. సుధీర్ఘమైన సముద్ర తీరం పచ్చదనంతో కూడిన ప్రకృతి ఎంతో విలువైన ఖనిజ సంపద అతి ప్రాచీన చరిత్ర బుద్ధుని క్షేత్రాలు దేశంలో కెల్ల అరుదైన ఆలయాలు శ్రీకాకుళం సొంతం. దీనిని పేదల ఊటీ గా అభివర్ణిస్తారు. ఇక్కడ మహాత్ముడు మూడు రోజుల పాటు గడిపాడు.

Palakonda Kota Durgammaఒకప్పుడు ఇది బౌద్ధమతానికి ముఖ్య స్థానంగా వర్ధిల్లింది. శాలిహుండం, దంతపురి, జగతిమెట్ట వంటి బౌద్ధారామాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. తరువాత ఇది కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. గాంగేయులు ఈ ప్రాంతాన్ని 6 నుండి 14వ శతాబ్దం వరకు, 800 సంవత్సరాలు పాలించారు. వజ్రహస్తుని కాలంలో ప్రసిద్ది చెందిన శ్రీ ముఖలింగం ఆలయాన్ని నిర్మించారు. మహమ్మదీయుల పాలన కాలంలో షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదు నిర్మించాడు. ఆంధ్ర ప్రదేశ్ లో నక్సలైటు (మావోయిస్టు పార్టీ) ఉద్యమం ప్రారంభమయింది శ్రీకాకుళం జిల్లాలోనే. ఇక ఇక్కడున్న ప్రధాన సందర్శనీయ ప్రదేశాలలో చాలా పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి.

Palakonda Kota Durgamma

అందులో ముఖ్యమైనది పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం. బొబ్బిలి రాజుల ఆరాధ్యదేవత పాలకొండ కోటదుర్గమ్మ. ఈ కోటదుర్గమ్మ ఆలయం ఉత్తరాంధ్రకే ప్రసిద్ధి. జిల్లాలోనే అత్యధిక ఆదాయాన్నిచ్చే ఆలయాల్లో ఇది రెండోది. ఇది పాలకొండలో ఉంది. 600 ఏళ్ల కిందట నిర్మించిన జగన్నాథస్వామి ఆలయం పాలకొండలో ఉంది. పూరీలో ఉన్న ఆలయ నమూనాలో నిర్మించారు. మనుమకొండలో అక్షరబ్రహ్మ ఆలయం ఉంది.

Palakonda Kota Durgammaశ్రీకాకుళం పట్టణానికి 36 కిలోమీటర్ల దూరంలో పాలకొండ అనే గ్రామంలో ఉంటుంది ఈ కోట దుర్గమ్మ దేవాలయం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అట్టహాసంగా, సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. కోటదుర్గమ్మ.. కరుణించు మాయమ్మ అన్న నామస్మరణతో పాలకొండ పట్టణం మారుమోగిపోతుంది. తెల్లవారు జామున నాలుగు గంటలకు స్థానిక భక్తులు అమ్మవారి మాలధారణ కార్యక్రమంతో ప్రత్యేక పూజలు చేస్తారు.

Palakonda Kota Durgammaపాలకొండలోని కోటదుర్గమ్మను దర్శించేందుకు తొలి రోజే నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఏడాదిలో ఒక్కసారి అమ్మ నిజరూపదర్శనం చేసుకుంటే జీవితకాల పుణ్యం చేకూరుతుందన్న నమ్మకంతో భక్తులు దేవస్థానానికి పోటెత్తుతారు. తొలిరోజు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఈవో టి.వాసుదేవరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంటారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR