ఈ ఆలయంలో వెలసిన పార్వతిదేవికి హిందూ సంప్రదాయంలో పూజలు అనేవి ఎందుకు జరగవు ?

0
4540

మన దేశంలో పురాతన కాలం లో అనేక ఆచారాలనేవి ఉన్నవి. ఆ ఆచారాలలో భాగంగానే ఈ దేవాలయంలో నరబలి కూడా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికి కొన్ని ఆలయాలలో జంతుబలి అనేది ఆచారంగానే వస్తుంది. మరి నరబలి ఉన్న ఆ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

narabaliమేఘాలయ రాష్ట్రం, షిల్లాంగ్ జిల్లా లో జైమ్ తియా హిల్స్ లో దుర్గాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు కొండజాతి తెగల ఆరాధ్యదైవంగా పూజలందుకొంటుంది. అయితే జయంతియా రాజు యొక్క వేసవి భవనం యొక్క శిథిలాల పక్కనే ఈ దుర్గ ఆలయం ఉంది. ఇక ఆ మహారాజు హిందూమతంలోకి మారడం వలన ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది.

narabaliఈ ఆలయానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉందని తెలుస్తుంది. ఇక ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా స్థానిక భక్తులు చెబుతున్నారు. పూర్వం ఈ ఆలయం తాటిఆకుల పందిరిలో ఉండేదని ఆ తరువాత ఈ ఆలయం ప్రస్తుత వేదికలోనికి మారినట్లుగా చెబుతారు.

narabaliహిందూసంస్కృతిలో శక్తి పూజలకు ఈ ఆలయం ఒక ముఖ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అయితే పార్వతీదేవి యొక్క దేశంలోని ఎడమతొడ భాగం ఈ ప్రదేశంలోనే పడినట్లు భక్తులు చెబుతారు. అందుకే ఈ ఆలయంలోని పార్వతీదేవిని జయంతేశ్వరి అని భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో కొలుస్తారు. ఇక్కడ వెలసిన అమ్మవారికి హిందూ సంప్రదాయంలో పూజలు అనేవి జరుగవు.

narabaliఇక్కడ కొలువై ఉన్న అమ్మవారికి పూజ సమయంలో మేకలను, భక్తులను బలిగా ఇస్తారు. పూర్వం ఒకప్పుడు ఈ ఆలయంలో నర బలులు కూడా ఇచ్చేవారని తెలుస్తుంది. అయితే బ్రిటీష్ వారి పరిపాలనలో వీటిని నిషేదించారు.

narabaliఇక్కడ మరో విశేషం ఏంటంటే, దేవి పూజ సమయంలో అరటి చెట్టును అలంకరించి పూజిస్తారు. పూజ ముగిసిన తరువాత ఆ అరటి చెట్టుని సాంప్రదాయ బద్దంగా ఊరేగింపుగా వెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారు.

narabaliఇలా ఎంతో శక్తివంతమైన పార్వతీదేవి వెలసిన ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు.

narabali