పార్వతి అమ్మవారు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయంలో నెమలి రూపంలో శివుడిని ప్రార్దించినట్లు స్థల పురాణం చెబుతుంది. అయితే ఆ అమ్మవారు అసలు నెమలి రూపం ధరించడం వెనుక కారణం ఏంటి? ఇక్కడికి వచ్చే అమ్మవారు ఎందుకు శివుడిని ప్రార్ధించింది? అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెన్నై నగరంలోని మైలాపూర్‌లోని అరుల్‌మిగు లో కపాలీశ్వరస్వామి ఆలయం. లయకారకుడైన శివుడు స్వయంగా భువిపై అవతరించిన క్షేత్రంగా ఈ ఆలయం వెలుగొందుతోంది. అరుల్‌మిగు కర్పగవల్లిగా ఆమె పరమేశ్వరుని పక్కన వెలిసింది. అందుకే దీన్ని భూకైలాసంగా అంటుంటారు. అమ్మవారు నెమలి రూపంలో శివుని సాక్షాత్కారం కోసం తపస్సు చేసింది అందుకనే మయిల్ అంటే నెమలి పేరుతో మైలాపూర్‌గా ఏర్పడింది. పురాణ విషయానికి వస్తే, నమశ్శివాయ అన్న పదానికి అర్థాన్ని శంభునాథుడు పార్వతీ దేవికి వివరిస్తుండగా ఆమె ఒక నెమలి వైపు దృష్టి సారించింది. దీంతో ఆగ్రహం చెందిన ఆయన నెమలిగా మారిపొమ్మని శాపం ఇస్తాడు. దీంతో ఆమె శాప విముక్తి కోసం ప్రార్థించగా భూలోకంలో తన కోసం తపస్సు చేస్తే విముక్తి కలుగుతుందని చెబుతాడు. భూలోకంపై అడుగుపెట్టిన పార్వతీ దేవి ఒక చెట్టుకింద నెమలిరూపంలో స్వామివారి కోసం తపస్సు చసింది. ఆమె తపస్సుకు ప్రత్యక్షమైన లయకారకుడు శాపవిముక్తి చేయడంతో పాటు కర్పగవల్లిగా దీవించాడు. దీంతో ఆ ఆదిదంపతులు ఇక్కడే నివాసముంటూ భక్తులకు అభయమిస్తున్నారు.ఇంకా రాక్షసుడు సురపన్మను సంహరించేందుకు సుబ్రమణ్యస్వామి ఈ ఆలయంలోనే తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన ఆదిదంపతులు తమ కుమారునికి వేలాయుధం ఆయుధాన్ని ఇక్కడే ఇచ్చినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. రాక్షస సంహారం అనంతరం శరవణుడు సింగారవేల్‌గా తిరిగొచ్చాడు. దేవలోకాధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రమణ్యస్వామికి ఇచ్చి వివాహం చేస్తాడు. దేవలోకంలో వుండే ఐరావతం దేవసేనతో బాటే వచ్చేస్తుంది. అందుకనే వల్లీ, దేవసేన సమేతంగా మురుగన్ ఐరావతంపై దర్శనమిస్తుంటారు. ఇది అరుదైన దర్శనం కావడం విశేషం. ఈ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి నెమలి రూపంలో శివుడిని ప్రార్ధించి శాప విముక్తిని పొందింది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.