ఈ సమస్యలు ఉన్నవారు క్యాబేజి తింటే మరింత ఎక్కువవుతాయట!

మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో క్యాబేజి కూడా ఒకటి. ఎరుపు, ప‌ర్పుల్‌, వైట్‌, గ్రీన్.. ఇలా భిన్న ర‌కాల రంగుల్లో మ‌న‌కు క్యాబేజీ ల‌భిస్తుంది. మ‌న‌కు గ్రీన్ క‌ల‌ర్ క్యాబేజీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే ఏ రంగు క్యాబేజీ అయినా స‌రే.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌నే అందిస్తుంది. పకోడీ, ఫ్రై, కూర ఇలా ఎన్నో రకాల వంటకాల్ని క్యాబేజీ తో మనం తయారు చేసుకోవచ్చు. అలానే సలాడ్స్ వంటి వాటిలో కూడా క్యాబేజీని వేసుకోవచ్చు. కానీ దాని స్మెల్ కార‌ణంగా చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అయితే క్యాబేజీలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, బి1, బి6, బి2, సి, కె తదితర విటమిన్లతోపాటు కాల్షియం, ఐరన్, సల్ఫర్, పొటాషియం, పాస్ఫరస్, ఫోలేట్ తదితర పోషకాలు కూడా క్యాబేజీలో పుష్క‌లంగా ఉంటాయి.
దీనిలోని విలువైన పోషకాలు మేలైన ఆరోగ్య పరిరక్షణకు దోహదపడటమే గాక చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి. క్యాన్సర్‌ను నిరోధించటంలో క్యాబేజీ కీల‌క పాత్ర పోషిస్తుంది.  క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన `ప్లేవనాయిడ్స్` సమృద్ధిగా అందుతాయి. తద్వారా `పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్`ను నివారిస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయం చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.
  • క్యాబేజీలోని గ్లుటామైన్‌ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌ అలర్జీలు, నొప్పి,వాపులను తగ్గిస్తుంది.  గాయాలు త్వరగా మానేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. క్యాబేజీల్లో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇది నారింజలో కంటే క్యాబేజి లో ఎక్కువగా లభిస్తుంది. క్యాబేజీ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల ఎంత వయసు పెరిగినా నిత్య యవ్వనంగా కనిపిస్తారు. అలాగే శ‌రీరంలో ఉన్న‌ వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంపి శ‌రీరాన్ని శుద్ధి చేయ‌డంలో క్యాబేజీ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • అయితే ఇలా ఎన్ని ప్రయోజనాలు ఇచ్చే క్యాబేజీ తీసుకోవడం వల్ల కొంత హాని కూడా కలుగుతుందట. కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం క్యాబేజీని తిన‌కూడ‌దు. తింటే స‌మ‌స్య‌లు మ‌రింత ఎక్కువ‌వుతాయి అంటున్నారు నిపుణులు. మ‌రి ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు క్యాబేజీని తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం… క్యాబేజీలో అధిక భాగం రిఫినోస్ అనే సమ్మేళ‌నం ఉంటుంది. ఇది స‌రిగ్గా జీర్ణం కాదు. అందువ‌ల్ల గ్యాస్‌, అజీర్ణం స‌మ‌స్య‌లు ఉన్న‌వారు క్యాబేజీని తింటే స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ క్యాబేజీని తిన‌రాదు.
  • శస్త్ర చికిత్స చేయించుకున్న వాళ్లు క్యాబేజీని అస్సలు తీసుకోకూడదు. తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలని ప్రభావితం చేస్తుంది. అందుకనే శస్త్రచికిత్స చేయించుకున్న రెండు వారాల వరకూ క్యాబేజీకి దూరంగా ఉండాలి. క్యాన్స‌ర్ చికిత్స తీసుకునేవారు క్యాబేజీని తిన‌కూడ‌దు. తింటే విరేచ‌నాలు అయ్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఈ విష‌యాన్ని డాక్ట‌ర్‌తో నిర్దారించుకోవాలి. ఇక విరేచ‌నాల స‌మ‌స్య ఉన్న‌వారు కూడా క్యాబేజీని తిన‌రాదు. తింటే స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌వుతుంది.
  • ర‌క్తాన్ని ప‌లుచ‌న చేసే మందుల‌ను వాడేవారు క్యాబేజీని తిన‌రాదు. క్యాబేజీలో అధిక మొత్తంలో విట‌మిన్ కె ఉంటుంది. ఇది గాయాలు అయిన‌ప్పుడు ర‌క్తం గ‌డ్డ క‌ట్టేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేసే మందుల‌ను వాడేవారు క్యాబేజీని ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోరాదు. డయాబెటిస్ తో బాధపడే వాళ్లు క్యాబేజీ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా డయాబెటిక్ పేషెంట్లు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. షుగర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
అలానే ఎలర్జీలు ఉన్నవాళ్లు క్యాబేజీని అస్సలు తీసుకోకూడదు. క్యాబేజీని ఎలర్జీలు ఉన్న వాళ్ల తీసుకుంటే మరింత ప్రమాదకరం. హైపో థైరాయిడిజం వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌వారు కూడా క్యాబేజీని తిన‌రాదు. తింటే థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు, థైరాయిడ్ మందుల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. క‌నుక వారు క్యాబేజీని మానేయాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR