రైతు పొద్దున లేచి పొలం పని మొదలు పెడితే కానీ మన ఐదు వేళ్ళు నోట్లో పెట్టలేము. మన రాష్ట్రం, దేశంలో ఎక్కడైనా కూడా రైతు బాగుంటేనే ప్రజలు బాగుంటారు, తద్ద్వార దేశం బాగుంటుంది…ఈ ప్రపంచమే బాగుంటుంది. కానీ మన దేశంలో రైతులు పొలాన్ని వదిలి రోడ్ ఎక్కారు….అన్నం పెట్టిన రైతు రోడ్ మీద వండుకుని తింటున్నాడు, మన ఆకలి తీర్చిన రైతుని అదే చేతితో కొడ్తున్నారు….
రైతు గోడు విని ఆ సమస్య పరిష్కరించాలి కానీ ఇలా మాత్రం చేయొద్దు. దేశ రాజధాని సాక్షిగా రైతన్నలను హింసిస్తున్న తీరు చూసి…ఈ చేత కానీ ప్రబుత్వాలని ఎం అనాలో కూడా అర్ధం కావడం లేదు…వాళ్ళ సమస్యలు తీర్చక పోయిన పర్వాలేదు కానీ ఇలా మాత్రం చేయొద్దు….దయ చేసి చేయొద్దు…
గోడు చెప్పుకోడానికి వచ్చిన రైతుని…గొడ్డుని కొట్టినట్టు కొడ్తున్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి రైతు కన్నెర్ర చేస్తే…శివుడి మూడో కన్ను తెరిచిన దానితో సమానం.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.