Home Unknown facts పోలేరమ్మ ఎవరు ? పోలేరమ్మకి ఆ పేరు ఎలా వచ్చింది

పోలేరమ్మ ఎవరు ? పోలేరమ్మకి ఆ పేరు ఎలా వచ్చింది

0

ఈ అమ్మవారిని గ్రామదేవతగా కొలుస్తారు. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు ఈ అమ్మవారిని పోచమ్మ అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు పోలేరమ్మగా పిలుస్తుంటారు. ఇక ఈ అమ్మావారు గ్రామ పొలిమేరలలో ఉండి రక్షణ గా ఉంటుంది కనుక పొలిమేరమ్మగాను పిలుస్తుంటారు. మరి ఈ అమ్మవారు ఎవరు? ఆ వ్రతం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

polerammaహిందూ ధర్మంలో శివుని ఆరాదించేవారిని శైవులుగానూ, విశ్ణువును ఆరాధించేవారిని వైష్ణవులుగానూ ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారు శాక్తేయులుగానూ పిలుస్తారు. త్రిమూర్తులకు కూడా ఆది పరాశక్తి అని దేవీ భాగవతం వర్ణన. ఇలా ఆరాధించే మూర్తులు అనేకరూపాలలో ఉంటాయి. ఈ శక్తిని శివుని భార్య పార్వతిదేవిలో ఉన్నాయని భావన. ఆ భావనల్తో అనేక రూపాలలో ఉన్న శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు. ఆమె విష్ణువులా రాక్షస సంహారిణి. లోకకంటకులగు అనేక రాక్షసులను ఆమె వధించి లోకాలను రక్షించి ప్రజలకు ఆనందం కలిగించింది.

ఊరి పొలిమేరలో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడే దేవి పోలేరమ్మ, మసూచి లాంటి రోగాల బారిన పడకుండా కాపాడ టానికి రోగం వచ్చిన తరవాత రోగనివారణకు అమ్మను పూజిస్తారు. కొన్ని రోగాలకు అమ్మవారి పేరు పెట్టి ఇప్పటి వరకూ పురాతన పద్ధతుల ద్వారా రోగ నివారాణ చేసే ఆచారం దేశమంతా అనేక రూపాలలో కనిపిస్తుంది. ప్రతి ఊరికీ గ్రామానికి గ్రామదేవతలు ఉంటారు. ఇలా హిందూధర్మంలో శక్తి ఆరాధన అనేక రూపాలలో కనిపిస్తుంది.

గ్రామదేవతలలో ఒకరు గ్రామశక్తి పోలేరమ్మ. ఇక పురాణానికి వస్తే, శ్రీమత్ కైలాస పర్వతం మీద ఈశ్వరుడు , పార్వతి ప్రధమ గణములతో కూర్చున్న సమయంలో పార్వతి శివునితో ఒక సంగతి అడుగుతుంది. మహాత్మా తమరు సమస్త లోకములు పరిపాలించు కర్తలు , ఏకనిదానముతో ఉన్నా వారైనందున తమకు తెలియని అంశములు ఏమియు లేవు . కృత , త్రేతా, స్వపర , కలియుగములో చివరిదైన కలియుగములో స్త్రీలు మిక్కిలి పాపత్ములుగాను , సంతానలేమి వారుగాను కాగలరు అని భవిస్య వాని చెప్పుతున్నందున పుణ్యము నిచ్చే ఒక వ్రతమును చెప్పుమని కోరగా, ఈ పోలేరమ్మ వ్రతము ను చెప్పెనని అంటారు.

ఈ వ్రతాన్ని స్త్రీలు భాద్రపద బహుళ అమావాస్య నాడు చేస్తారు.

Exit mobile version