అరికాళ్ల మంటలు రావటానికి గల కారణాలు

ఎండాకాలంలో అరికాళ్లలో మంట తరచుగా చూసేదే. మీలాగే చాలామంది దీంతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం పాదాల్లో నాడులు దెబ్బతినటం (న్యూరోపతీ). దీంతో నాడుల పోచలు అతిగా స్పందించి మంట పుట్టేలా చేస్తాయి. దెబ్బతిన్న నాడులు గాయాల వంటివేవీ లేకపోయినా మెదడుకు నొప్పి సంకేతాలు అందిస్తుంటాయి. ఫలితంగా మంట, నొప్పి వంటివి వేధిస్తుంటాయి.

Possible causes of soles inflammationకీమోథెరపీ, మద్యపానం, అథ్లెట్ల పాదాలు, ఎయిడ్స్, మూత్రపిండాల వైఫల్యం, రక్తహీనత మరియు కొన్ని ఇతర కారణాల వల్ల ఈ అరికాలి మంటలు ఏర్పడుతాయి. వీటివలన వేడిగా, సూదులు గుచ్చినట్లుగా నొప్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుంది. మీరు వేసవిలో కొంత వ్యక్తిగత సంరక్షణ మరియు కొన్ని గృహ వైద్య నివారణలతో ఈ అరికాళ్ళ మంటలను తగ్గించుకోవొచ్చు.

అల్లం :

Possible causes of soles inflammationప్రతి రోజు పది నిమిషాలు అల్లం రసం మరియు ఆలివ్ లేదా కొబ్బరి నూనె కలిపిన వెచ్చని మిశ్రమంతో మీ పాదాలను మరియు కాళ్లను మర్దన చేయటం వల్ల నొప్పి తగ్గుతుంది మరియు రక్త ప్రసరణ చురుగ్గా జరుగుతుంది.

హతోర్న్ :

Possible causes of soles inflammationఒక కప్పు నీటిలో హాతోర్న్ఒక టేబుల్ స్పూన్ కలపండి మరియు రోజులో పదిహేను నిమిషాలు నాననివ్వండి . హాతోర్న్ రక్త నాళాలను వ్యాకోచింప చేయటం వల్ల రక్తప్రసరణ కాళ్ళకు మరియు ఇతర శరీర భాగాలకు మరింత చురుగ్గా జరుగుతుంది. ఇది వేసవిలో అరికాళ్ళ మంటలకు ఉత్తమ నివారణలలో ఒకటి .

థైమ్ :

Possible causes of soles inflammationథైమ్ కలిపిన చల్లని లేదా వేడి నీటిలో అరికాళ్ళను నాననివ్వటం వల్ల అరికాళ్ళ మంటలకు సంబందించిన నొప్పి మరియు తిమ్మిరి ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజులో ఇరవై నిమిషాలు మీ పాదాలను థైమ్ లో నాననివ్వటం వలన తరుచుగా సంభవించే ఈ పరిస్థితిని నిరోధించవచ్చు.

విటమిన్ B3 :

Possible causes of soles inflammationవిటమిన్ B3 సమృద్ధిగా ఉన్న గుడ్డు పచ్చసొన, పాలు, బటానీలు మరియు చిక్కుళ్ళు వంటి పోషక ఆహార వినియోగాన్ని పెంచడం వల్ల పాదాలమంటలకు ఒక సాధారణ సహజ పద్ధతిలో నివారణ కలుగుతుంది. విటమిన్ B3 నరాలకు బలాన్ని చేకూరుస్తుంది మరియు రక్తపీడనం వల్ల నరాల ఒత్తిడిని నిరోధిస్తుంది.

ఆహారంలో మార్పు :

Possible causes of soles inflammationఆహారం మరియు ఆర్ద్రీకరణ ప్రోటీన్లు మరియు కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాన్ని ముఖ్యంగా చేపలు, ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, నట్స్ మరియు అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవటం వల్ల క్రమంగా అరికాళ్ళ మంటలు నివారింపబడి పరిస్థితి మెరుగుపడుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR