Few Best Political Dialogues From Tollywood Movies To Sum Up This Election Heat

Desam lo elections fever chaala gattigaa undhi… Ika mana telugu states lo inkaaa… Telangana lo yelaano assembly elections ayipoyayi kabatti, parliament kosam gatti workouts ye chesthunnaaru… Mari andhra lo ayithe aa fever debbaki thermometer lu pagilipothunnaay… Aa range lo tough fight kanipisthundhi… Manifestos vacchesaay, nominations ayipoyayi, inko konni rojullo campaigning kooda aapesthaaru… Paiki dhairyam ga cheppukokapoyinaa, yenni kaburlu maatladina, okati maathram nijam… Ee konni rojulllo dabbulu yerulay paaradam khaayam… Aa mandhu, biryaani lu ika common… Ayithe my dear buddies, manaki cinema lu, sports tharuvatha politics baaga guri… Sayanthram tea thaaguthaa sollu yesukunte mana dhaggara unde topics lo ivi deadly common kadhaa… Ayithe, ippudu matter yentante manaki telugu lo politics meedha vacchina cinemaala count baagane undhi… Ayithe, vaatilo politics meedha veera level dialogues kooda unnaay kadhaa… So, nenu cheppocchedhi yentante thatto mottoo manalni kadhipina dialogues ni okasaari palakariddhaam…

1) అవినీతిని అంతం చేసే దమ్ము నాకుంది, ప్రజల సొమ్ము ప్రజలకి దమ్ము నాకుంది;
ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓటు వేసే దమ్ము మీకుందా…! (Leader)

powerful Political dialogues

2) ఎలక్షన్స్ లో నిలబడేటప్పుడు, ప్రజల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ పిల్లలకి ముద్దులు పెట్టి, వాళ్ళ ***** తుడిచి, ఆ గుడ్డతో ముఖం తుడుచుకొని… అబ్బా, ఎంత పుణ్యం చేసుకున్నామని కాకా పట్టి, వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్యే అయిపోయి, మంత్రులు అయిపోయి, అదే ఓట్లు వేసిన జనం మీ దగ్గరికి వస్తే, ఇప్పుడు కలవరు అని అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. మీరే ప్రజల దగ్గరకెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని పబ్లిక్ సర్వీస్ చెయ్యాలి, అదిరా రాజకీయం అంటే… (Operation Duryodhana)

powerful Political dialogues

3) రాజకీయం – రా అంటే రాష్ట్రంలోని, జ అంటే జనాల్ని, కీ అంటే కీడు చేసే, యం అంటే యంత్రాంగం అని అర్థం. (Prathidwani)

powerful Political dialogues

4) పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం..! సిగరెట్ కాలిస్తే కాన్సర్ వస్తుంది, నేను పోతా, నా కుటుంబం రోడ్ మీద పడుతుంది. ఒక ఎదవ సిగరెట్టు ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేసింది అంటే ఒక ఎదవ రాజకీయ నాయకుడు అసెంబ్లీలో కూర్చుంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. (Nene Raju Nene Manthri)

powerful Political dialogues

5) ఈవాళ రాజకీయం సేవకి మార్గం కాదు, వ్యాపారం చేసుకునే మార్కెట్ అయిపోయింది. అందుకే, రౌడీలు, గూండాలు, కాంట్రాక్టర్లు అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళు గెలవడానికి కారణం ఎవరు..? మీరు కాదా..! తప్పు మీది కాదా…! (Adhineta)

powerful Political dialogues

6) 60 (71) ఏళ్ళ స్వతంత్ర్య భారతంలో అంటరానితనమా..! ఎంత మూర్ఖత్వం, వీళ్ళా మనల్ని పాలించేది..! (Leader)

powerful Political dialogues

7) ఈ విగ్రహ రాజకీయాలు వచ్చిందే వాళ్ళ వారసత్వం మీరు ఎక్కడ మర్చిపోతారో అన్న భయం నుండి. (Nene Raju Nene Manthri)

powerful Political dialogues

8) 18 సంవత్సరాలకి ప్రేమించి పెళ్ళి చేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18 సంవత్సరాలకి ఓటు వేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరూ అడగరేం…? (Prathinidhi)

powerful Political dialogues

9) రాజకీయం అంటే డబ్బు, బందుత్వాలు, కొనటం‌, అమ్ముడుపోవడం. (Leader)

powerful Political dialogues

10) నాయకుడు అనేవాడు సెపరేట్ పార్ట్స్ తో ఏమీ పుట్టడు, మీలానే ఉంటాడు, మీలోనే ఉంటాడు. (Nene Raju Nene Manthri)

powerful Political dialogues

11) ఒక్క క్షణం తప్పు చేస్తే 1825 రోజులు బాధ పడాలి, మీరు బాగుపడాలంటే ఆలోచించి ఓటు వెయ్యండి. (Adhineta)

powerful Political dialogues

12) సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇక మన దేశంలో పుట్టరు అనుకున్నారా…! ఈసారి ఓటు వేసేప్పుడు మనసులో ఒకసారి “జనగణమన” అని ఓటు వెయ్యండి. ఖచ్చితంగా అలాంటి మంచి మనుషులు మనలో నుండి వస్తారు. (Nene Raju Nene Manthri)

powerful Political dialogues

13) కన్న బిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారు, ఇండియా క్రికెట్ టీమ్ సరిగ్గా ఆడకపోతే వాళ్ళ ఇళ్ళపై రాళ్ళు వేస్తారు. అదే మన నియోజకవర్గం ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎందుకు నిలదీయరు..! ఎందుకు మందలించరు..? (Adhineta)

powerful Political dialogues

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR