డెలివరీ తర్వాత మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బిడ్డకు జన్మ నివ్వడం అనేది జీవితాన్నే మార్చేసే ఒక ఆనందకరమైన విషయం. ఇక స్త్రీలకైతే బిడ్డకు జన్మనివ్వడం అనేది మరో జన్మతో సమానం అంటారు. స్త్రీకి ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలల కాలంలో శరీరంలో చాలా మార్పులు జరుగుతాయని అందరికీ తెలుసు. అయితే బిడ్డకు జన్మ నిచ్చిన తరువాత ఆరు వారాల్లో ఈ మార్పులు రివర్స్ అవుతాయని మీకు తెలుసా? గర్భాశయం దాదాపు అసలు పరిమాణానికి తగ్గిపోతుంది, గర్భం హార్మోన్లు శరీరం నుండి స్పష్టంగా కనిపిస్తాయి. రక్త ప్రసరణ సాధారణ స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Precautions that women must take after deliveryఅయితే చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు కాన్పు జరిగిన తర్వాత వారు తీసుకోకపోవడంతో మహిళల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. డెలివరీ తర్వాత ఇన్‌ఫెక్షన్‌, జ్వరం రావడం, యూరినరీ ప్రాబ్లమ్స్‌, బ్రెస్ట్‌ ప్రాబ్లమ్స్‌, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ తర్వాత మహిళలు ప్రసవానంతర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

Precautions that women must take after deliveryచాలా మంది తల్లులు బిడ్డ పుట్టిన తరువాత కనీసం మొదటి ఆరు వారాల వరకు తిరిగి ఎప్పటిలా పనులు చేసుకోలేరు. నిజానికి నిపుణులు చెప్పినదాని ప్రకారం మహిళలు ప్రసవించిన రెండో వారం నుంచే వ్యాయామం చేయొచ్చు. అయితే ఏదైనా కారణం వల్ల తల్లి సిజేరియన్ చేయించుకుంటే, గాయం పూర్తిగా నయం కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి 2-3 నెలల తర్వాత వ్యాయామాలు చేయడం, మంచిది. వ్యాయామం వల్ల పొట్ట కండరాలు, పెల్విక్ కండరాలు దృఢమవుతాయి. నడుమునొప్పి తగ్గుతుంది.

Precautions that women must take after deliveryవ్యాయామం చేయడం ఎప్పటి నుండి మొదలు పెట్టాలి అనే విషయంలో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అప్పుడు కూడా చేసే వ్యాయామాలు కఠినంగా ఉండకూడదు. వీలును బట్టి స్ట్రెచెస్, స్లోగా వాకింగ్ మొదలు పెట్టొచ్చు. వ్యాయామం వల్ల మహిళలు స్ట్రాంగ్ అవుతారు. అంతే కాక మూడ్ కూడా మారుతుంది. వ్యాయామం మాత్రమే కాకుండా ప్రసవం తరువాత పని చేయడం కూడా మంచిది. ఇలా చేయడం వల్ల ప్రసవానంతర వచ్చే సమస్యలు తగ్గుతాయి.

Precautions that women must take after deliveryఒకవేళ డెలివరీ టైమ్‌లో స్త్రీ అప్పటికే వ్యాయామం చేస్తుంటే, ఆమెకు నార్మల్ అనిపించిన వెంటనే తిరిగి ప్రారంభించడం మంచిది. అయితే ముందులా కాకుండా కాస్త నిదానంగా క్రమంగా చేయాలి. శక్తి ఉంటే, కొంచెం ఫాస్ట్ గా నడవడం కూడా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల, తర్వాత కాస్తా కష్టమైన వ్యాయామాలు చేయడానికి సహాయపడుతుంది. ఈత కొట్టడం డెలివరీ తర్వాత మంచి వ్యాయామం అని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, డెలివరీ అయిన 4-6 వారాల తర్వాత మాత్రమే ఈత కొట్టడం ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు.

Precautions that women must take after deliveryడెలివరీ తరువాత బిడ్డను ఎత్తుకోవడానికి వంగడం, తల్లి పాలివ్వడం వల్ల వెన్నెముక దెబ్బతిని దీర్ఘకాల వెన్నునొప్పికి కారణం కావచ్చు. అయినప్పటికీ, శరీరాన్ని మృదువుగా ఉంచి, కండరాలని బలంగా చేయడానికి సున్నితమైన స్ట్రెచెస్, స్త్రోల్స్ మంచివని డాక్టర్స్ చెబుతున్నారు. మలబద్ధకం, పైల్స్ ను నివారిస్తుందని డాక్టర్స్ చెబుతున్నారు. గర్భాశయానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను నివారించడానికి మంచి పెల్విక్ టోన్‌ని నిర్వహించడానికి డెయిలీ రొటీన్‌లో పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు లేదా కెజెల్స్ వ్యాయామాలను భాగం చేసుకోవాలి.

Precautions that women must take after deliveryకొంతమంది మూత్రాన్ని ఆపుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటారు. అలాంటి మూత్ర సమస్యలను కూడా నివారించడానికి, తగ్గించడానికి ఈ వ్యాయామాలు సహాయపడతాయి. దగ్గు, తుమ్ము ఉన్నప్పుడు మూత్రం లీకేజ్ అయ్యే పరిస్థితిని కూడా ఈ వ్యాయామం చేయడం వల్ల తగ్గించవచ్చు. లెగ్ రైజెస్, పెల్విక్ బ్రిడ్జ్, క్రంచెస్ మరియు హీల్ టచింగ్ వంటి కోర్ బలోపేతం చేసే వ్యాయామాలను రెగ్యులర్ గా చేయాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఇలా వ్యాయామాలు చేయడం వల్ల కొంత కాలానికి పొట్ట ఇదివరకులా అవ్వడానికి, పూర్వ బరువును తిరిగి పొందడానికి, మానసికంగా, శారీరకంగా సామాజికంగా మంచి అనుభూతిని పొందడంలో మీకు సహాయపడతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR