వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సాధారణంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా చక్కర్లు కొట్టి మనకు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమయంలో వర్షంతోపాటు చలి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం అధికం. అసలే ఒక పక్క కరోనా.. దీనికి తోడు ఈ చల్లని.. తడి వాతావరణం మన ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. వర్షం కారణంగా చాలా చోట్ల వాటర్ లాగింగ్, ధూళి కారణంగా దోమలు, ప్రమాదకరమైన బ్యాక్టీరియా పుడుతుంది. నీరు మరియు గాలి ద్వారా, ఈ బ్యాక్టీరియా ఆహారం ద్వారా, దాని ద్వారా మన శరీరానికి చేరుకుంటుంది. ఇది జ్వరం, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడేలా చేస్తుంది.

వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపైగా, ఈ సీజన్‌లోనే ప్రాణాంతకమై సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుంటాయి. వర్షం కారణంగా ఇళ్లలోకి తేమ రావడం వల్ల తేమ సమస్య తలెత్తుతుంది. ఇళ్లలో తేమ పెరగడం వల్ల నల్ల ఫంగస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. నల్ల ఫంగస్ వేసవిలో జన్మించినప్పటికీ, వర్షంతొ వచ్చే తేమలో ఇది వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలంలో కలుషిత నీటిని తాగితే టైఫాయిడ్‌, కామెర్లు, వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులవర్షాలు పడుతుండడంతో జలుబు, దగ్గుతో చిన్నారులు సతమతమవుతారు. ఉబ్బసం, అతిసార కేసులు ఎక్కువగా ఈ సీజన్‌లో నమోదు అవుతాయి. పిల్లలు ఏ మాత్రం నలతగా కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అందరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. స్వచ్ఛమైన నీటిని తాగాలి. పిల్లలు వర్షంలో తడిచినప్పుడు వెంటనే తడిచిన దుస్తులను వెంటనే విప్పేసి..వారి తల, శరీరం పొడి టవాలుతో తుడవాలి. వేడివేడిగా పాలు తాగించాలి. జలుబు దరి చేరకుండా జాగ్రత్త తీసుకోవాలి. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్‌ వద్దకు తీసుకుపోవాలి. చిన్నారుల విషయంలో సొంత వైద్యం పనికిరాదు.

వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులవర్షంలో తడిచినప్పుడు తక్షణ నివారణ చర్యలను పాటిస్తే అనారోగ్యం బారినపడకుండా తప్పించుకోగలుగుతారు. వర్షంలో తడిసి ఇంటికి రాగానే శుద్ధి చేసిన మంచి నీటిని తాగాలి. అవి లేకుంటే కాచి చల్లార్చిన నీటిని తాగితే ఇంకా మంచిది. గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే బాగుంటుంది. అది వీలుకాకుంటే కాళ్లు, చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వర్షంలో తడిసిన అనంతరం పొడిగుడ్డతో శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. అపరిశుభ్ర ప్రాంతాల్లో తిరగకూడదు.

వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులఅనారోగ్య సమస్యను ప్రాథమిక స్థాయిలో కనిపెడితే తొందరగా నివారించవచ్చు. వర్షానికి తడిసి శరీరం నత్తగా ఉండి, బాధగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే, వర్షంలో తడవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గొడుగు పెట్టుకోవడం, రెయిన్‌ కోటు వేసుకోవడం వంటివి చేయాలి. ఒకవేళ గొడుగు, రెయిన్‌ కోటు లేకుంటే వర్షం తగ్గేంత వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.

వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులజూన్‌ నెల నుంచి అక్టోబర్‌ మధ్యలో వ్యాపించేది మలేరియా. ఎనాఫిలిస్‌ అనే దోమకాటుతో మలేరియా జ్వరం వస్తుంది. దీని లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య సేవలు పొందాలి. లేకుంటే ఆరోగ్యం త్వరగా దెబ్బతింటుంది. రోజూ జ్వరం రావడం, తలనొప్పి, కండరాలనొప్పులు, వణుకుతో కూడిన జ్వరం, చెమటలు పట్టడం, రక్తహీనత తదితర లక్షణాలతో బాధపడుతున్నవారు వెంటనే వ్యాధి నిర్ధారణ కోసం రక్తపరీక్షలు చేయించుకోవాలి.

వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులనీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు పెరిగే ప్రదేశాన్ని వెంటనే నిర్మూలించాలి. వాటర్‌ కూలర్‌లో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. సెప్టిక్‌ ట్యాంకులపై ఎప్పుడూ మూత ఉంచాలి. చెత్తాచెదారం ఎప్పటికప్పుడు పారబోయాలి. దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా తలుపులు, కిటికీలకు దోమతెరలు వాడాలి.

వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులవర్షంలో తడిచిన‌ప్పుడు మొదటిగా చర్మం, వెంట్రుకల మీద ప్రభావం ప‌డుతుంది కాబట్టి శ్రద్ధ ఎక్కువ‌గా తీసుకోవాలి. వర్షాకాలంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి. వర్షాకాలంలో డే టు డే కేర్ తీసుకుంటే జుట్టును కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో సరిగా కేర్ తీసుకోకపోతే తడిచిన వెంట్రుకల నుండి చెడు వాసన వచ్చే అవకాశం కూడా వుంది. దాంతో చుండ్రు, వెంట్రుకలు తెగిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తల తడిగా ఉండటం వల్ల తలనొప్పి తరచూ వేధిస్తుంటుంది. కాబట్టి అందుకు తగ్గ సంరక్షణ పద్ధతులు పాటిస్తే వర్షాకాలంలో కూడా కురులు సురక్షితంగా ఉంటాయి.

మామిడి ఆకు తల మాడు చల్లగా, తడిగా మరియు దురదతో ఇరిటేషన్ తెప్పించే విధంగా ఉంటే వేపనూనెను ఉప‌యోగించాలి. నిమ్మనూనెను తలకు రాయడం వల్ల తలను శాంతపరుస్తుంది. నిమ్మలో ఉన్న ఆయుర్వేద గుణాలు కురులు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. చుండ్రు ఉన్నవారు వర్షాకాలంలో డైరెక్ట్ గా తలస్నానం చేయకూడదు. తలస్నానానికి ముందు పెరుగు లేదా రీఫైయిన్డ్ ఆయిల్ ను తల మాడుకు బాగా మసాజ్ చేసి,అరగంట తర్వాత స్నానం చేయాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR