బీపీ ఏ ఏ సమయాలలో చెక్ చేసుకోవాలో తెలుసా

బీపీ లేదా రక్తపోటు, ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. రక్త నాళాలు నిరంతరం ఒత్తిడిని పెంచడం వలన గుండె, మెదడు, మూత్రపిండాలు, ఇతర వ్యాధుల ప్రమాదానికి దారితీస్తాయి. సాధారణంగా ధూమపానం, మద్యపానం చేసేవారిలో, వృద్ధులు, అధిక బరువు ఉన్నవారిలో, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో బీపీ ఎక్కువగా కనిపిస్తోంది.

Precautions To Be Taken Before Doing BP Checఇది ఎక్కువైనా సమస్యే.. తక్కువైనా సమస్యే. అందుకే.. బీపీ ఎప్పుడూ నార్మల్ గా ఉండేలా చూసుకోవాలి. నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80. అంత కంటే ఎక్కువ ఉంటే.. ఎలివేటెడ్ అని అంటారు. 130 / 80 దాటితే.. హైపర్ టెన్షన్ స్టేజ్ లో ఉన్నట్టు. 140 దాటితే.. హైపర్ టెన్షన్ స్టేజ్ 2 అని అర్థం. 140 దాటితే.. ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించి మెడిసిన్ తీసుకోవాలి. దానికి చికిత్స తీసుకోవాలి. లేకపోతే.. హైబీపీ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

Precautions To Be Taken Before Doing BP Checహైపర్ టెన్షన్ తో బాధపడేవాళ్లకు హైబీపీ వస్తుంది. ఊరికే కోపం వచ్చేవాళ్లకు కూడా హైబీపీ వస్తుంది. ఆహారపు అలవాట్లు, జీవన విధానం కూడా బీపీ పెరగడానికి దారి తీస్తుంది. అయితే.. హైపర్ టెన్షన్ తో బాధపడేవాళ్లు ఖచ్చితంగా బీపీని క్రమం తప్పకుండా ట్రాక్ చేసుకోవాలి. అలా అయితేనే వాళ్ల ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే.. లేనిపోని సమస్యలు వస్తుంటాయి.ఆరోగ్యంతో ఎలాంటి సంబంధం లేకుండా అన్ని వయసుల వారు తరచూ బీపీ చెక్ చేసుకోవటం మంచిదే. మంచి బీపీ మెషీన్ ఇంట్లో ఉంటే చాలు, క్షణాల్లో మీ బీపీని తెలుసుకోవచ్చు. కానీ ఇలా బీపీ చెక్ చేసే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బీపీ చెక్ చేసే సమయంలో చెయ్యిని ఎలా ఉంచారు, మీ మూడ్ ఏంటి వంటివి బీపీ రీడింగ్ ను ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి.

Precautions To Be Taken Before Doing BP Checఉదాహరణకు ఆఫీసు వర్క్ ఎక్కువగా ఉండి, ఇంట్లో కూడా ఎక్కువ పని ఉన్నప్పుడు కచ్ఛితంగా మన బీపీ లెవెల్స్ లో హెచ్చు తగ్గులుంటాయి. సరిగ్గా తినకపోయినా, ఎక్కువ తిన్నా కూడా, జ్వరం వంటివి ఉన్నా మీ బీపీ స్థాయిల్లో మార్పులుంటాయి. ఉపవాసం ఉండి, జాగారం చేసి, ఉదయం బీపీ రీడింగ్ తీసుకుంటే చాలా మార్పులు కనిపిస్తాయి. అంతేకాదు మీ వయసుతో నిమిత్తం లేకుండా మీ 2 చేతుల్లో 2 రకాల బీపీ రీడింగ్స్ రావచ్చు.

Precautions To Be Taken Before Doing BP Checకొందరికి అన్నం తిన్న తర్వాత బీపీ తగ్గుతుంది. అన్నం తిన్న తర్వాత రక్తం.. తిన్న ఆహారాన్ని డైజెస్టివ్ ట్రాక్ట్ లోకి పంపిస్తుంది. అప్పుడు బీపీ తక్కువవుతుంది. అందుకే.. అన్నం తినగానే బీపీ చెక్ చేసుకోవద్దు. అప్పుడు కరెక్ట్ రీడింగ్ చూపించదు. అన్నం తిన్న తర్వాత కనీసం ఓ గంట ఆగి.. బీపీ చెక్ చేసుకోవడం మంచిది. అన్నం తినగానే.. గుండె వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం బ్లడ్ ప్రెజర్ వేరే అవయవాలకు చేరడం వల్ల.. గుండె వేగం పెరుగుతుంది.

Precautions To Be Taken Before Doing BP Checకొంత మందిలో తిన్న తరువాత కూడా బ్లడ్ ప్రెజర్ తగ్గదు, ఇలా ఎందుకు జరుగుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ కి బయట ఉన్న బ్లడ్ వెస్సెల్స్ కన్స్ట్రిక్ట్ అవ్వకపోవడం వల్ల. ఈ కండిషన్ ని పోస్ట్ ప్రాండియల్ హైపోటెన్షన్ లేదా లో బ్లడ్ ప్రెజర్ ఆఫ్టర్ ఈటింగ్ అని అంటారు. ఈ పోస్ట్ ప్రాండియల్ హైపోటెన్షన్ యొక్క లక్షణాల్లో డిజ్జీనెస్, పెయింటింగ్, ఛాతీలో నొప్పి, కళ్ళు మసకబారడం, వికారం, తలతిరగడం వంటివి ఉంటాయి. ఎక్కువ సేపు ఏమీ తినకుండా ఉండడం వలన కూడా బ్లడ్ ప్రెజర్‌లో తగ్గుదల కనిపిస్తుంది.

Precautions To Be Taken Before Doing BP Checబీపీ రీడింగ్ తీసుకునే ముందు.. అస్సలు సిగిరెట్ తాగకూడదు. ఆల్కాహాల్ తీసుకొని బీపీ చెక్ చేసుకోకూడదు. అలాగే.. బీపీ చెక్ చేసుకునే ముందు.. బ్లాడర్ ఖాళీగా ఉండాలి. బ్యాక్ స్ట్రైట్ గా ఉంచాలి. కాళ్ళు ఒక దాని మీద ఒకటి వేసుకోకూడదు. రెండు పాదాలూ ఫ్లాట్‌గా నేల మీద ఉంచాలి. చేతిని ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఆనించి ఉంచాలి. మీ చేయి పై భాగం గుండెకి సమాంతరంగా ఉండాలి. రీడింగ్ తీసుకోవడానికి ముందు ఐదు నిమిషాలు కంఫర్టబుల్‌గా రెస్ట్ తీసుకోండి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR