శరీరానికి ముఖ్యమైన ఆధారం ఎముకలే. శరీరానికి ఆకారాన్ని ఇచ్చి రక్షణని కలిగించడమే కాదు శరీరాన్ని నిలబెట్టేవి ఎముకలే. ఇవి బలంగా ఉంటేనే నిటారుగా నిలుస్తాం. ఎంత దూరమైనా వేగంగా నడిచేస్తాం. పెద్ద బరువులనైనా అలవోకగా ఎత్తేస్తాం. ఎముకలు ప్రధానంగా కొల్లాజెన్, కాల్షియం అనే రెండు పదార్థాలతో తయారవుతాయి. ఇవి కూడా మన శరీరంలో పెరుగుతుంటాయి. ఎముకలు శరీరమంతటికీ బలం, సమతుల్యత, మద్దతును అందిస్తాయి.