కృష్ణుడికి ప్రీతికరమైన చెట్టుగా నేరేడు చెట్టుని చెబుతారు. నేరేడు పండ్లని కృష్ణుడికి నైవేధ్యంగా పెడతారు. ఎండాకాలం సీజన్ లో వచ్చే ఈ పండ్లు ఆరోగ్యానికి, ముఖ్యంగా మధుమేహగ్రస్థులకు ఎంతో మేలు చేస్తుంది. కేవలం నేరేడు పండ్లే కాదు నేరుడు ఆకులు కూడా ఆరోగ్యానికి బహు విధాలుగా ఉపయోగాపడుతాయి. నేరేడు ఆకులలో ముదురు ఆకుపచ్చరంగులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, యాంటీవైరస్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి, మలబద్దకం నివారిస్తుంది, అలర్జీలను పోగొడుతాయి. ఈ ఆకులను సిల్క్ వార్మ్ కు ఆహారంగా ఉపయోగిస్తారు, ఆ లీఫ్ ఆయిల్ ను సోపులు, పెర్ఫ్యూమ్స్ వంటి సుగందాల తయారీకి ఉపయోగిస్తారు.
నేరుడు ఆకులను ఆయుర్వేధ చికిత్సల్లో ఎక్కువగా వాడుతున్నారు. వీటిలో వైద్యపరమైన అనేక గుణాలుండటం వల్ల డయోరియా ,అల్సర్ వంటి జబ్బులను తగ్గిస్తుంది. ఈ ఆకులకు యాంటిబ్యాక్టీరియల్ గుణం ఉంది. పూర్వం గాయాలకు చీముపడితే నయం చేయను నేరేడు ఆకులను వాడేవారు. నేరేడులో విషాన్ని హరించే శక్తి ఎక్కువగా ఉందని పురాతన వైద్యశాస్త్రంలో వెల్లడించారు.
పూర్వకాలంలో ఏదైనా విషపురుగులు శరీరంలో ఏదైనా భాగంలో కుట్టినట్లయితే వెంటనే నేరేడు ఆకులను అక్కడవేసి కట్టు కట్టేవారు. శరీరంలో ప్రవేశించిన విషం ప్రభావం మెల్లిగా నేరేడు ఆకులకు చేరి తెల్లారే సరికి రోగి లేచికూర్చునేవాడట. ఆకు రసంతో పసుపు కలిపి పురుగులు కుట్టిన చోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే ఉపశమనం లభిస్తుంది.
ఆకులను తీసుకొని, వాటిని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించాలి. 10 నిమిషాలు ఉడకబెట్టిన తరువాత, నీరు ఆకుపచ్చగా మారుతుంది. ప్రతిరోజూ ఉదయం నీటిని వడకట్టి దాన్ని తింటే బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమితే కదిలే దంతాలు గట్టిపడతాయి. అలాగే నేరేడు చెక్క కషాయాన్ని పుక్కిలిపడితే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయి.
ఈ నేరుడు ఆకులను 10-15గ్రా తీసుకుని బాగా కడిగి ఆకులను, మూడు నల్లమిరియాలు వేసి పేస్ట్ చేసి , నీరు కలిపి జ్యూస్ చేయాలి. ఈ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులోకి చేరిన తల వెంట్రుకలు, లోహపు ముక్కలతో పాటు కిడ్నీల్లోని రాళ్లను సైతం కరిగిస్తుంది. ఈ పండ్ల రసంలో తేనె కలిపి తాగితే అరికాళ్లు, అరిచేతుల మంటలు, కాళ్ల మంటల నుంచి ఉపశమనం పొందవచ్చు.
పైల్స్ సమస్యకు నేరేడు ఆకుల నుండి తయారు చేసిన కాషాయం మంచి ఔషధంలా పనిచేస్తుంది. నేరుడు ఆకులకు పుదీనా లేదా కొత్తిమీర, కొద్దిగా బెల్లం మిక్స్ చేసి జ్యూస్ తయారుచేసి తాగాలి. అవసరం అనుకుంటే పాలతో కలిపి తాగవచ్చు. ఇలా ఒక వారం పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ అవసరం లేకుండా బ్లీడింగ్ పైల్స్ నుండి ఉపశమనం పొందవచ్చు.
జ్వరం వచ్చినప్పుడు, ఈ కషాయం లోకి ధనియాలు వేసుకున్నట్లయితే జ్వరం తగ్గిపోతుంది. మూత్రం వచ్చేటప్పుడు మంట వచ్చినట్లయితే.. ఇక ఈ ఆకుల రసంలోకి నిమ్మకాయ రసం వేసుకొని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఎక్కువ మల విసర్జన అయ్యేవారు ఈ ఆకు యొక్క కషాయం తాగడం వల్ల దాని నుంచి విముక్తి పొందవచ్చు.
అదే విధంగా, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి వేప ఆకులు మరియు మెంతి గింజలతో ఉడకబెట్టండి. టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో ఇది బాగా సహాయపడుతుంది. నేరేడు ఆకులను ఎండబెట్టి మరియు పొడి కూడా చేయవచ్చు. దీనిని మోరింగ పౌడర్‌తో కలపండి. డయాబెటిస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది