సీజనల్ వ్యాధులు నుండి కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణంలో మార్పులు సహజం. వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం ఇలా కాలాలు మారుతాయి. కాలాలు మారడం చాలా మంది ఆస్వాదిస్తారు. కానీ ఈ కాలాల మార్పు చాలా మంది ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. కాలాలు మారినప్పుడల్లా అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తూ వుంటాయి. జ్వరం, దగ్గు, జలుబు మరియు చికెన్ పాక్స్ ఇలాంటి వ్యాధులు సాధారణంగా వస్తాయి.

సీజనల్ వ్యాధులువ‌ర్షాకాలం ప్రారంభం అవగానే మ‌న‌కు వ‌చ్చే అనేక వ్యాధుల్లో జ‌లుబు, ద‌గ్గు స‌హ‌జ‌మైన‌వి. ప‌లు ర‌కాల వైర‌స్‌ల వ‌ల్ల ఈ వ్యాధులు వ‌స్తాయి. వాతావరణం చల్లబడింది. ప్రతిరోజూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షాకాలంలో మొదలయ్యే సీజనల్ వ్యాధులు కూడా నేనున్నానంటూ జనాలను పీడించేందుకు రెడీ అయ్యాయి. ముఖ్యంగా జలుబు మరియు దగ్గు వల్ల కలిగే సమస్యలు మనకు మనశ్శాంతిని దూరం చేస్తాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే.. వీటి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సీజనల్ వ్యాధులురోగనిరోధక శక్తిని పెంచుకోవడం కాలానుగుణ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.” విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయల యొక్క జ్యూసులు తాగడం, వాటిని తినడం రోగనిరోధక శక్తిని పెంచే రెండు సాధారణ మార్గాలు.

సీజనల్ వ్యాధులుఇలాంటి వాతావరణంలో గోరు వెచ్చని నీరు ఉపశమనం కలిగించడంతోపాటు ఔషధంలా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే వేడినీళ్లు తాగితే మలబద్ధకం, అజీర్తీ సమస్యలు తగ్గుతాయి. ప్రతీరోజూ వేడినీళ్లు తీసుకోవడం వల్ల అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. జలుబును తగ్గించుకోటానికి నీటిని తాగటం అనేది చాలా సులువైన పద్దతి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోరువెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో కలిగే ఇన్‌ఫక్షన్‌ను తగ్గిస్తుంది. రోజు మొత్తం వేడిగా ఉండే నీటిని తరచుగా తాగటం వలన మంచి జలుబు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

సీజనల్ వ్యాధులుపసుపు కలిపిన పాలు మన భారతదేశంలో ప్రాముఖ్యం పొందిన ఔషదంగా చెబుతారు ఆయుర్వేధ నిపుణులు. పాలలో ఒక చెంచా పసుపు కలుపుకొని తాగితే దగ్గు మరియు జలుబు నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అల్లంతో చేసిన వేడి టీ తాగిన జలుబు మరియు దగ్గు నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది.

సీజనల్ వ్యాధులునిమ్మరసానికి కొన్ని చుక్కల తేనె మరియు దాల్చిన చెక్క పొడి కలిపి తయారు చేసిన సిరప్ జలుబు నుండి త్వరగా ఉపశమనం అందిస్తుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు తాగటం వల్ల జలుబు మరియు దగ్గు నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్యనిపుణులు.

సీజనల్ వ్యాధులుశరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అల్లం చాలా ఉపయోగపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి తలనొప్పి, కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. ఈ కాలంలో అధికంగా అల్లాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

సీజనల్ వ్యాధులు ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటితో చిటికెడు పసుపును కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీయల్, వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

సీజనల్ వ్యాధులు నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రోగాలు రాకుండా కాపాడుతాయి. నిత్యం నల్ల మిరియాలను ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR