జుట్టు రాలడం తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0
476

అందంలో జుట్టుది అగ్రస్థానం. జుట్టుని అందంగా పెట్టుకున్నప్పుడే అలంకరణ పూర్తవుతుంది. కానీ మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్ల వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటాం. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. మరి జుట్టు రాలడానికి కారణాలేంటో తెలుసుకుని అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామా.

జుట్టు రాలడంసాధారణంగా కాలుష్య వాతావరణంలో తిరగటం వలన జుట్టుపై దుమ్ము, ధూళి చేరి, జుట్టు వివిధ రకాల ఇన్ఫెక్షన్ లకు గురవుతుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఎప్పటికపుడు జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది వారంలో ఒకసారి మాత్రమే తలస్నానం చేస్తూ ఉంటారు. ప్రస్తుత వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా తలస్నానం చేయడం మంచిది. మరో ముఖ్య విషయం ఏంటంటే… తలస్నానం చేసేటప్పుడు మరీ ఎక్కువ వేడి నీళ్లు ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీళ్లు కానీ చల్లటి నీళ్ళని కానీ వాడాలి.

జుట్టు రాలడంజుట్టు తడిగా ఉంటే త్వరగా ఆరాలని చాలా మంది డ్రయ్యర్స్‌ని ఉపయోగిస్తారు. కానీ, సాధ్యమైనంత వరకూ సహజంగానే జుట్టుని ఆరేలా చేసుకోవాలి. లేదా మెత్తని కాటన్, టర్కీ టవల్ ద్వారా జుట్టుని ఆరబెట్టుకోవాలి. కాసేపు టవల్ తలకు చుట్టి వదిలేయండి. ఇలా చేయడం వల్ల జుట్టులోని తడిని టవల్ పీల్చుకుని పొడిగా అవుతుంది.

జుట్టు రాలడంకొంతమంది జుట్టు షైనింగ్‌గా ఉండాలని రకరకాల హెయిర్ స్ప్రేలు వాడతారు. దీని వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మారతాయి. అంతేనా వెంట్రుకల చిట్లుతాయి కూడా. అందుకే అలాంటి హెయిర్ స్ప్రేలు వాడకపోవడమే మంచిది.

జుట్టు రాలడంఇక చాలా మంది జుటు సమస్యలు తగ్గించుకునేకుందు కెమికల్స్‌తో కూడాన కాస్మెటిక్స్, క్రీమ్స్ వాడతారు. ఇవి తాత్కాలికంగా పనిచేసినా శాశ్వతంగా పరిష్కారం ఉండదు. కాబట్టి అలా కాకుండా సహజసిద్ధమైన చిట్కాలు పాటించండి.

జుట్టు రాలడంమనం తీసుకునే ఆహరం కూడా జుట్టు ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ప్రోటీన్ లేకున్నా జుట్టు సమస్యలు ఎదురవుతాయి. అందుకే తీసుకునే డైట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. గుడ్లు, పాలు మీ డైట్‌లో చేర్చుకోవడం మరిచిపోవద్దు.

 

SHARE