శివుడు ధరించే ప్రతి ఆభరణం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా

శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. సృష్టి మొత్తం నీలకంఠుడి ఆజ్ఞ మేరకే నడుస్తుంది, అయినా సరే ఆయన నిరాడంబరంగానే ఉంటాడు. స్మశానంలో నివసిస్తాడు, భస్మం ధరిస్తాడు. శివుడు ధరించే ప్రతిదాని వెనుక ఆంతర్యం ఉంటుంది.

నంది :

precious ornaments of lord shivaఎద్దు(నంది)శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల ఉంచబడుతుంది. శివ భక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని నంది చెవుల వద్ద గుసగుసగా చెప్పుకుంటారు.

త్రిశూలము:

precious ornaments of lord shiva

శివుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలము లేదా త్రిశూల్ అని చెప్పవచ్చు. శివుని ఒక చేతిలో త్రిశూల్ ఉంటుంది. త్రిశూలం లో ఉండే 3 వాడి అయిన మొనలు కోరిక,చర్య మరియు జ్ఞానం యొక్క మూడు శక్తులను సూచిస్తాయి.

నెలవంక :

precious ornaments of lord shivaశివుడి తలపై అర్ధచంద్రాకారంలో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు వృద్ది చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది.

నీలిరంగు కంఠం :

precious ornaments of lord shivaశివునికి మరొక పేరు నీలకంఠుడు. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగేసాడు. అప్పుడు దేవి పార్వతి శివుని కంఠంలో విషాన్ని ఆపేయడం వల్ల కంఠం నీలం రంగులోకి మారింది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నారు.

రుద్రాక్ష :

precious ornaments of lord shivaశివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారాన్ని ధరిస్తారు. ‘రుద్రాక్ష’ అనే పదము ‘రుద్ర’ (శివ యొక్క మరొక పేరు) మరియు ‘అక్ష్’ అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్లాయి.

పాము :

precious ornaments of lord shivaశివుడి మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము యొక్క 3 చుట్టలు భూత,వర్తమాన,భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. పాము హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా చెప్పవచ్చు.

మూడో కన్ను :

precious ornaments of lord shivaశివుని నుదుటిపైన మధ్యభాగంలో మూడో కన్ను ఉంటుంది. అయన చాలా కోపంతో మరియు చెడు నాశనం కోరుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది.

డమరుకం :

precious ornaments of lord shivaశివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు.

అట్టకట్టుకొని ఉన్న జుట్టు :

precious ornaments of lord shivaఅట్టకట్టుకొని ఉన్న జుట్టు సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది. శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా ‘జటా’ అందం మరియు పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR