Presenting You The Aparichitulu Of Tollywood & We Are Like ‘Yevaru Mummy Veelu’

తెలుగు సినిమాల్లో అపరిచితులు.. అవును, మీరు విన్నది నిజమే..! అలా అని మన అపరిచితుడు విక్రమ్ గారి గురించి చెప్పట్లేదు ఇక్కడ. నిజంగానే మన సినిమాల్లో కొందరు అపరిచితులు ఉన్నారు. సినిమాలో వీళ్ల గురించి ఎక్కడో ఓ చోట ప్రస్తావన ఉంటుంది.. వీళ్లు సినిమాలోని ప్రధాన పాత్రలకు సంబంధించిన వాళ్లే అయి ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు సినిమా కథ మొత్తం వీళ్ల చుట్టే తిరగొచ్చు కూడా. అయినా వీళ్లు సినిమాలో ఎక్కడా కనిపించరు. కనిపించినా కూడా ప్రత్యక్షంగా ఉండరు. ఆశ్చర్యంగా ఉంది కదూ..! అందుకే అపరిచితులు అంటున్నాం అన్నమాట.

సినిమా కథ ఏదైనా, ఎలాంటిది అయినా.. కొన్ని పాత్రలు సినిమాకి ప్రాణంగా నిలుస్తాయి. కథని ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడతాయి. సినిమా చూస్తున్నంత సేపు అలాంటి స్పెషల్ క్యారెక్టర్లు.. మనకు సినిమాలో ఉన్న ఫీలింగే ఉంటుంది. ఈ విధంగా కనిపించీ కనిపించని పాత్రలను సినిమాల్లో పెట్టారు.. అసలు పెట్టాలనే ఆలోచన మన మూవీ మేకర్స్ కి వచ్చిందంటే అది గొప్ప విషయమే. ఎందుకంటే.. సినిమాలో ఎంతో కొంత ముఖ్యమైన పాత్రే అయినా.. వాటిని చూపించకుండా, మనకు మాత్రం అవి ఉన్నట్లే అని అనిపించేలా కథ నడపడం గొప్పే కదా..! సో.. ఇప్పుడు అలాంటి అపరిచితులు మన తెలుగు సినిమాల్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం..

1. మాయాబజార్

5 Mayabazarతెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టి, ఇంకో పది తరాలు ఇది మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునేలా చేసిన అద్భుతం మాయాబజార్. టెక్నాలజీ అంటే ఏంటో తెలియని ఆ రోజుల్లోనే గ్రాఫిక్స్ తో మాయ చేశారు. తెలుగు వాళ్లు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని సాధ్యం కాని పని చేసి ఓ మాయా అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించారు. సినిమాలో ఘటోత్కచుడు, శ్రీ కృష్ణుడు, శశిరేఖ, అభిమన్యుడు.. పాత్రలు చేసిన మహానుభావులు అందరూ వారి పాత్రలకు ప్రాణం పోశారు. వీళ్లే కాదు.. సినిమా కథలో ఇంకా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. వాళ్లే పాండవులు.. సినిమా కథ మొత్తం పాండవుల చుట్టే తిరుగుతుంది. చాలా సన్నివేశాల్లో వాళ్ల ప్రస్తావన వస్తుంది. కానీ సినిమాలో ఎక్కడా ఆ పాత్రలు కనిపించవు. చూస్తున్నంతసేపు వాళ్లు సినిమాలో ఉన్నట్లే అనిపిస్తుంది.

2. బాహుబలి

7 Bahubaliదర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి సెల్యులాయిడ్ మ్యాజిక్ బాహుబలి. ఈ సినిమా చేసిన రచ్చ ఎలాంటిదో మనం ఈ రోజుకీ మర్చిపోలేదు. రెండు భాగాలుగా తీసిన ఈ సినిమా విడుదల కోసం ఎంతలా మనం ఎదురుచూశామో.. ఎంత పిచ్చివాళ్ళం అయ్యామో కదా. ఇంత చరిత్ర సృష్టించిన బాహుబలి సినిమాలో మన అందరికి వచ్చిన ఒకే ఒక అనుమానం.. భల్లాలదేవుడి భార్య ఎవరని. భల్లాలదేవుడి పాత్ర సినిమాకి ఎంతో ముఖ్యం.. ఆ పాత్రకి ఒక కొడుకు కూడా ఉంటాడు. మరి అదేంటో అతని భార్య పాత్ర మాత్రం సినిమాలో పెట్టలేదు. కథ ప్రకారం సినిమాకి ఆ పాత్ర అంత అవసరం లేకపోయినా, కొడుకు పాత్ర ఉన్నప్పుడు మరి భార్య ఎవరు అని సహజంగానే మనకు వచ్చిన ఆలోచన.

3. బొమ్మరిల్లు

3 Bommariluఈ మూవీలో సురేఖావాణి ఎప్పుడూ తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. ఆ ఇంట్లో ఏం జరిగినా, ఏం చేసినా ముందు తన భర్తకి అన్నీ ఎప్పటికప్పుడు చెప్పేస్తూ ఉంటుంది. ఆ భర్త క్యారెక్టర్ మాత్రం ఎవరో ఏంటో చూపించరు. గొంతు తప్ప ఆ పాత్రకి మనిషి లేడు. ఇదే మనం మాట్లాడుతున్న అపరిచితుడి పాత్ర అన్నమాట బొమ్మరిల్లు సినిమాలో. ఇలాంటి ఒక పాత్ర కూడా సృష్టించి సురేఖావాణి పాత్రకి ఒక ఎపిసోడ్ క్రియేట్ చేశారు అంటే మామూలు విషయం కాదు.

4. మహానటి

1.mahanatiవెండితెర అందాల జాబిలి సావిత్రి గారి బయోపిక్ మహానటిలో కూడా ఓ అపరిచితుడు ఉన్నాడు. ఈ సినిమా మొత్తం సమంత ఒకరి గురించి వెతుకుతూ ఉంటుంది. అదే శంకరయ్య ఎవరో తెలుసుకోవాలని. అసలు శంకరయ్యకి, సావిత్రి గారికి సంబంధం ఏంటని. ఆ పాత్ర పేరు సినిమా మొత్తం ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటుంది. కానీ, సినిమా చివరి వరకు ఆ పాత్ర గురించి మనకు చెప్పకుండా మనలో సస్పెన్స్ క్రియేట్ చేశారు. సినిమాలో తమ అత్యుత్తమ నటనతో అందరూ గుర్తుండిపోయారు, అలాగే పాత్ర లేకపోయినా ఈ శంకరయ్య అనే పేరు కూడా అంతే గుర్తుండిపోయింది.

5. సుందరకాండ

6 Sudarakandaవిక్టరీ వెంకటేష్ గారు బెత్తం పట్టుకుని పాఠాలు చెప్పిన మూవీ సుందరకాండ. ఈ సినిమాలో ఒక గమ్మత్తైన పాత్ర ఉంటుంది. అదే వెంకీ వాళ్ల బామ్మ క్యారెక్టర్. అది కూడా గోడకు తగిలించిన ఓ ఫొటోలో. సినిమా మొత్తం బామ్మ నిర్మలమ్మ గారు ఫొటోలో కనిపిస్తారు, కానీ ప్రత్యక్షంగా ఎక్కడా ఆ పాత్ర ఉండదు. సినిమాలో మన వెంకీ మామ అష్టకష్టాలు పడుతూ ఉంటే బామ్మ మాత్రం ఫొటోలో నుండే తనని వెక్కిరిస్తూ ఉంటుంది. ప్రతి సీన్ కి కొత్త కొత్త హావభావాలతో నిర్మలమ్మ గారి ఫోటో కాన్సెప్ట్ భలే క్రియేట్ చేశారు. సినిమా కోసం ఒక అరగంటలో నిర్మలమ్మ గారితో ఫోటోషూట్ చేసి పంపించేసారట దర్శకేంద్రులు కే. రాఘవేంద్ర రావు గారు.

6. అరుంధతి

8 Arundhathiవదల బొమ్మాళీ.. వదల అంటూ పశుపతి అరుంధతి కోసం ఏళ్లుగా సమాధిలోనే ఉండి, పిశాచిలా పగబట్టి మనల్ని కూడా తెగ భయపెట్టాడు కదా..! ఈ సినిమా మన స్వీటీ అనుష్క కెరీర్ ని ఒక మలుపు తిప్పింది. తన అక్క చావుకి కారణం అయ్యాడని అరుంధతి తన బావ పశుపతిని సంస్థానం నుండి వెళ్లగొడితే, అరుంధతిపై ప్రతీకారంతో తంత్ర విద్యలు నేర్చుకుని అఘోరలా మారి మళ్లీ గద్వాల్ గడ్డపై అడుగుపెడతాడు. అది కూడా సరిగ్గా అరుంధతి పెళ్లి చేసుకున్న రోజే. మరి అరుంధతి ఎవరిని చేసుకుంది.. ఆ మనిషి ఎవరు అనేది మాత్రం సినిమాలో చూపించలేదు. కథాపరంగా మనకు అక్కడ పశుపతి, అరుంధతి క్యారెక్టర్ల మీద ఉన్న ఫోకస్ తో ఎవరూ అలా ఆలోచించలేదు కూడా.

7. జాను

4 Jaanuజాను, రామచంద్ర స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్.. అంతేకాదు, ఇద్దరి మధ్య తెలిసీతెలియని వయసులో ఒక చిన్న లవ్ ట్రాక్ కూడా. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ దూరమవుతారు. కాలం గడిచి, దూరం పెరిగి జాను వేరేవాళ్లని పెళ్లి చేసుకుంటుంది. కానీ, రామచంద్ర మాత్రం సోలో బతుకే సో బెటర్ అనుకుని జాను జ్ఞాపకాలతో సింగిల్ గానే ఉండిపోతాడు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ కలుసుకుంటారు. రామ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని జాను పదే పదే అడుగుతూ ఉంటుంది. తను పెళ్లి చేసుకుంది.. కానీ ఎవరిని చేసుకుందో మాత్రం చూపించరు. సినిమాకి మెయిన్ లీడ్ హీరోయిన్ భర్త పాత్ర మాత్రం ఇక్కడ మనకు అపరిచితుడిగానే ఉంచేశారు.

8. అర్జున్ రెడ్డి

2.arjun Reddyఅర్జున్ రెడ్డి.. బోల్డ్ అండ్ జెన్యూన్ లవ్ స్టోరీ.. ఇది టాలీవుడ్ లో క్రియేట్ చేసిన మ్యాజిక్ తో ఈ సినిమా ఇన్స్పిరేషన్ గా తర్వాత చాలా మూవీస్ వచ్చాయి. ప్రీతి, అర్జున్ ల ప్రేమకథకి మాత్రం పిచ్చ ఫ్యాన్స్ అయిపోయాం. ప్రీతికి పెళ్లి అయిపోయిందని.. అర్జున్ సినిమా అంత తన జ్ఞాపకాలతోనే తెగ మందు తాగేసి, గడ్డం పెంచుకుని దేవదాసు కూడా అయిపోయాడు. సినిమా చివర్లో ప్రీతి చెప్తుంది.. పెళ్లి చేసుకున్నా, కానీ వాడిని నా చిటికెన వేలు కూడా తాకనివ్వలేదని. సో.. ఇక్కడ కూడా ప్రీతి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరో మనకు చూపించలేదు. అర్జున్ కోసమే ఒంటరిగా తాను కూడా ఎదురుచూసిందని, వాళ్ల ప్రేమ అద్భుతమని చూపించి మూవీ ఎండ్ చేశారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR