భోజన ప్రియులు తమకు ఇష్టమైన ఫుడ్ కంటికి కనిపిస్తే చాలు లొట్టలేసుకుని ఆరగించేస్తుంటారు. ఈ సమయం, ఆ సందర్భం అని చూడకుండా నచ్చింది లాగించేస్తుంటారు. కానీ ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడే అంతా సక్రమంగా ఉంటుంది. అలా కాదని ఎలా పడితే అలా ఉంటానంటే తేడా వస్తుంది. ఆహారం విషయంలోనూ అలాగే జరుగుతుంది. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం తప్పదు. ముఖ్యంగా ఏ ఆహారంతో కలిపి ఏది తీసుకోవాలి… ఏ ఆహారంతో కలిపి ఏది తీసుకోకూడదు అనే విషయంపై క్లారిటీ ఉండాలి. పండ్లని తినేటప్పుడు ఇలా మిక్స్ చేసి తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇప్పుడు ఏ ఏ పండ్లు కలిపి తీసుకోకూడదు అనేది తెలుసుకుందాం.
జామకాయ- అరటికాయ ఒకేసారి తినకూడదు. జామకాయను ఎక్కువగా షుగర్ పేషెంట్లు తింటూ ఉంటారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరు జామకాయను ఇష్టపడతారు. అయితే జామ పండు తిన్న తర్వాత వెంటనే అరటి పండు తింటే కడుపులో తిప్పినట్లు అవుతుంది. తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
పనస – పాలు : అదే విధంగా పనస పండుని పాలతో పాటు తీసుకోకూడదు. ఇలా కనక చేశారు అంటే చర్మ సమస్యలు వస్తాయి.
బొప్పాయి – నిమ్మరసం : ఎప్పుడైనా బొప్పాయి పండు తినేటప్పుడు నిమ్మరసం కానీ నిమ్మకాయ కానీ కలిపి తీసుకోవద్దు అని డాక్టర్లు అంటున్నారు. ఇది చాలా ప్రాణాంతకమైనది. ఇలా తింటే ఎనిమియా సమస్యకి ఇది దారితీస్తుందని.. హిమోగ్లోబిన్ లో కూడా సమస్యలు వస్తాయి.
పాలు – నిమ్మకాయ: పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే సంగతి తెలిసిందే. కడుపులోకి వెళ్లినా ఇలాగే జరుగుతుంది. కడుపులో ఉండే జీర్ణరసాల్లో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్ విషంగా మారే ప్రమాదం ఉంది.
పుచ్చకాయ – కర్బూజా : పుచ్చకాయ మరియు కర్బూజా కూడా కలిపి తీసుకోకూడదు. దీని వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి.
క్యారెట్ – కమలాలు: పండ్లలో ఆరెంజ్ ను ఇష్టపడని వారంటూ ఉండరు. పుల్లగా తియ్యగా ఉండే ఈ పండు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా విటమిన్ సి ఈ పండులో ఎక్కువగా లభిస్తుంది. అయితే ఈ పండ్లతో కలిపి క్యారెట్ ను అసలు తినకూడదు. అలా తినడం వల్ల గుండెలో మంట కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి వెంటవెంటనే వీటిని అసలు తినకూడదు.
పులుపు – పెరుగు : పుల్లగా ఉండే పండ్లు ఎప్పుడూ పెరుగుతో తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే అస్సలు అరగదు అని అంటున్నారు.
పాలు – అరటి పండు: ఆయుర్వేద నిపుణులు పూర్తిగా వ్యతిరేకించే కాంబినేషన్ ఇదే. ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది.