“ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా…”
‘పట్టుదల’ సినిమా లోని ఈ పాట…వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ……ఈ పాటని ఇప్పటికీ ఒక్క పాటగా మాత్రమే వినేవారు కొందరైతే.. మరికొందరికి మాత్రం వారి గమ్యాన్ని నిర్దేశించి…ఎప్పుడూ ఒక నూతన ఉత్సహాన్ని పొందుకోడానికి ఓ ఎనర్జీ డ్రింక్ లా చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ ఒక్క పాటనే కాదు….సిరివెన్నెల గారు ‘సినిమా’ అనే మాధ్యమం ద్వారా… మనల్ని మనం ప్రశ్నించుకునేలా, మన గమ్యాన్ని మనం నిర్దేశించుకునేలా, జీవిత పాఠాల్ని తన పాటల ద్వారా తెలియజేస్తూనే వస్తున్నారు.
మీరు ఎపుడైనా…కొంచెం దిగులుగా ఉన్నా, కొంచెం అధైర్య పడ్డా, కొంచెం నిరాశ లో ఉన్నా… ఎలాంటి పరిస్థితిలో ఉన్నా…సిరివెన్నెల గారి పాట వింటే…ఆ పాటలోని లోతు అర్ధం చేసుకోగలిగిన ఆ రోజుకి మీకు ఓ ఎనర్జీ డ్రింక్ తాగినట్టు అనిపిస్తుంది…!
సిరివెన్నెల గారు రాసిన ఇలాంటి చాలా పాటల్లో…కొన్ని పాటలు…..ఆ పాటల్లోని జీవిత పాఠాలు ఓ సారీ…చూద్దాం రండి!
1. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా – కొత్త బంగారు లోకం
2. ఎంతవరకు ఎందుకొరకు – గమ్యం
3. ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ – Jalsa
4. చేసేదేదో చేసేముందే – ముకుంద
5. చుట్టు పక్కల చూడరా చిన్న వాడా – రుద్రవీణ
6. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి – పట్టుదల
7. సాహసం నా పథం – మహర్షి
8. You and I – Jalsa
9. Do it just do it – Bhadra