మన చుట్టూ పరిసర ప్రాంతాలు చూసినట్లయితే రావి చెట్టుని పెంచుకోవడం కాదు కదా కనీసం ఊరిలో ఎక్కడ ఉన్న దానిని నరికివేస్తారు. దాదాపుగా ఎవరు నివసించని ప్రదేశంలోనే మనం మర్రి చెట్టులు చూస్తుంటాం. ఇలా చేస్తున్న మనమే కొన్ని దేవాలయాలలో రావి చెట్టు ఉండటం గమనించడమే కాదు ఆ చెట్టుకి తాకుతూ పూజలు కూడా చేస్తుంటాం. అసలు రావి చెట్టు తాకడం వలన మనకి ఏమైనా దురదృష్టం కలుగుతుందా లేదా పుణ్యం ఏమైనా వస్తుందా? ఈ రావి చెట్టుకి అసలు కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణం విషయానికి వస్తే, పాల సముద్రం వలికిన సమయంలో లక్ష్మి దేవిని పెళ్లి చేసుకుంద్దాం అని భావిస్తాడు శ్రీ మహా విష్ణువు. కానీ ఆ సమయంలో లక్ష్మి దేవి, నాకంటే పెద్దది అయినా అక్క జ్యేష్ఠ లక్ష్మి పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకోను అని అడిగింది. ఈ విషయంపై బాగా ఆలోచించిన విష్ణువు తన భక్తుడైన ఒక మునికి జ్యేష్ఠ లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయగా అతనితో కాపురానికి వెలుతుంది. అయితే ముని చాలా పవిత్రంగా రోజు పూజలు చేయడం, శుభ్రంగా ఉండటం, నిత్యం హోమం గుండం, మంత్రజపం చేయడం ఆమెకు నచ్చేది కాదు. ఈ విషయాలతో విసిగిపోయిన జ్యేష్ఠ లక్ష్మి మునిని నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడే ఉంటాను అని చెబుతుంది. దీనితో ఆ ముని ఆమెను రావి చెట్టు మొదల్లో వదిలిపెడతాడు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండటం ఇష్టంలేక నన్ను ఇక్కడికి నుండి ఎక్కడికైనా పంపించమని విష్ణు మూర్తిని ప్రాధేయపడుతుంది.
దానితో విష్ణువు రావి చెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు నీకు ఎక్కడ దొరకదు అని చెబుతాడు. అయితే ఆమె ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అనడంతో సరే వారంలో ఐదు రోజులు ఎవరు రాకున్నా చివరి రెండు రోజులు వచ్చి పూజిస్తారు అని విష్ణువు వరం ఇస్తాడు. అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుంది. శనివారం లేదా ఆదివారం చెట్టును తాకితే అదృష్టమని పండితులు చెబుతున్నారు.
ఈవిధంగా శ్రీ మహావిష్ణువు కారణంగా ఒక మునిని పెళ్లిచేసుకున్న జ్యేష్ఠ లక్ష్మి రావి చెట్టులో ఉండి పూజలు అందుకోవడమే కాకుండా శని, ఆది వారాలలో ఆ చెట్టుని తాకితే అదృష్టమని, సోమవారం నుండి శుక్రవారం వరకు రావిచెట్టుని తాకితే దరిద్రం అంటూ కొందరు పండితులు తెలియచేస్తున్నారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.