Meet Radhan, The Authentic Music Director Who Is Taking Music Composition To A Whole New Level

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు ఊరికే అనలేదు తెలుగు చదువుతుంటే ఏదో తెలియని అనుభూతి కానీ ఆ అనుభూతిని తరాలు మారే కొద్దీ ఆగాథంలోకి తెలుగు భాషని అందరం కలిసి నెట్టివేశం. అసలికి ఇప్పటి జనరేషన్ ఐతే తెలుగు అంటే అది ఎదో బూతులా చూసుతున్నారు. తెలుగు భాష ఈ రోజున ఇంతటి దుస్థితి కి దిగజారడానికి ఎవరు కారణం?

కానీ కొంతమంది తెలుగు భాష అభివృధికి కృషి చేస్తూనే ఉన్నారు అలాంటి వారిలో ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు భాష మాధుర్యాన్ని తెలియజేస్తున్న రాజన్ కినిగె కి పాదాభి వందనం…

– అజగవ అంటే ఏమిటి?

“అజగవ” అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు.

– మహాకవి శ్రీశ్రీ కవిత్వ పరిచయం

“కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ” అన్నాడు చలం.

అసలు ఎవరీ శ్రీశ్రీ. తెలుగులో కవిత్వం పేరెత్తగానే అందరి తలలూ ఆయనవైపెందుకు తిరుగుతాయి?

– తెలుగు సాహిత్యంలో తప్పకుండా చదువ వలసిన కొన్ని పుస్తకాలు!

– శ్రీరాముడే ఉపమానంగా సీతమ్మ వారి వర్ణన!

సాధారణంగా మన కావ్యాలలో స్త్రీని వర్ణించేటప్పుడు చంద్రుడినో, కలువనో, కమలాన్నో ఉపమానంగా వాడుతూ ఉంటారు.
కానీ, ఇందుకు భిన్నంగా ఓ అద్భుతమైన పద్య రచన చేశారు మన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు.

– దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వ పరిచయము

– సరదా చాటువులు – పొడుపుకథ – భ్రమక పదాలు

తెలుగు సాహిత్యంలోని అద్భుతమైన పొడుపుకథ

– భార్యాబాధితాష్టకం

భార్య అనే రెండక్షరాల బ్రహ్మపదార్థం మీద నాకున్నవి భయభక్తులేగాని, మరొకటి కాదని సహృదయులైన భార్యలు, విధేయులైన వారి భర్తలు గమనించ ప్రార్థన. – రాజన్ పి.టి.ఎస్.కె

– నాయనమ్మా నమస్తుభ్యం!

మా నాయనమ్మ చెప్పిన తన చిన్ననాటి సంగతులు, జానపద సాహిత్యం

– సీత అనే పేరు పెట్టుకుంటే కష్టాల పాలవుతారా?

రామాయణానికి సంబంధించి, అందులోని పాత్రలకు సంబంధించి ఎప్పుడూ అనేక సందేహాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. వాటిలో ఒకటి ఈ ధర్మసందేహం!

– అతిరథ మహారథులు అంటే ఎవరు?

యుద్ధవీరులలో ఉన్న శ్రేణుల పేర్లు, వాటి వివరాలు, ఉదాహరణలతో…

– సుందరాకాండ మొత్తం ఒక చిన్న పద్యంలో!

మన తెలుగు సాహిత్యంలో ఎన్నో గొప్ప పద్యాలు ఉన్నాయి. అందులో ఒక ఉత్తమ స్థాయి భావుకత ఉన్న పద్యం ఇది. సుందరాకాండ మొత్తం స్థూలంగా చక్కని ఒక చిన్న పద్యంలో ఇమిడిపోయింది.

– వేటూరి జన్మరహస్యం! – Veturi Janma Rahasyam

కీ.శే. శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారి భక్తుడు చేస్తున్న అక్షరార్చన

– వ్యాసుడు పెట్టిన పరీక్షలో నెగ్గిన కాళిదాసు! ద్రౌపదికి పాండవులతో ఉన్న సంబంధంపై పద్యం!

మహాకవి కాళిదాసు తన కవిత్వపటిమతోను, సమయస్ఫూర్తితోను వ్యాసభగవానుని మెప్పించిన కథ.

– పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ! – చాటువులు

తెలుగు భాషలో చాటువులకు విశేషమైన స్థానం ఉంది. చమత్కారంతోను, విరుపులతోను మనసుకు ఆహ్లాదాన్ని అందించే గుణం ఈ చాటువులకు ఉంది.

– జేబున్నీసా – ఛత్రపతి శివాజీని ప్రేమించిన ఔరంగజేబు కుమార్తె ప్రేమకథ!

పింగళి వారి పేరు చెబితే పులకించని తెలుగువాడుండడు. మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి ఇలా ఆల్ టైమ్ క్లాసిక్స్ అన్నింటికీ పాటల మూటలు వారు కట్టినవే. ప్రణయం, వేదాంతం, హాస్యం ఇలా ఎటువంటి గీతానికైనా శాశ్వతత్వాన్ని ఇవ్వగల సాహితీ సవ్యసాచి పింగళి నాగేంద్రరావు గారు. ఇక మాటల రచనలో కూడా “సాహసము సేయరా ఢింభకా!”, “పుట్టించక పోతే మాటలెలా పుడతాయి!” అంటూ ఆయన చేసినన్ని ప్రయోగాలు కూడా ఎవరూ చేసుండరేమో!

– మిహిరకులుడు – భారతదేశంలో అత్యంత క్రూరుడైన పరిపాలకుని చరిత్ర!

పాశ్చాత్యుల కళ్ళతో భారతీయచరిత్రను చూడక తప్పనిదిగా మన విద్యావిధానం తయారైనదనీ, అందువల్ల మన అసలు చరిత్ర మరుగున పడిపోతుందనీ, భావించిన విశ్వనాథ… పురాణవైరగ్రంథమాల, కాశ్మీరరాజవంశ చరిత్ర, నేపాళరాజవంశ చరిత్ర అనే విభాగాలలో ఎన్నో చారిత్రక నవలలు వ్రాశారు. ఆ కోవలోనిదే ఈ “మిహిరకులుడు”.

– వేటూరి పాటలతో తెలుగు హీరోలతో అల్లిన సరదా కథ – వేటూరిగారొస్తున్నారు!

తెలుగు సినీ నటులు, నటీమణులు, దర్శకులు ఒకనాటి సాయంత్రం ఏర్పాటు చేయబడిన సమావేశానికి వస్తారు. తెలుగు సినీ ఘనకవితా చక్రవర్తి శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారిని కలవడానికి ఏర్పాటు చేయబడిన సమావేశమది. ఆయన వచ్చేలోపు వాళ్ళంతా ఏం చేశారన్నదే పాటలతో అల్లిన ఈ సరదా సన్నివేశ చిత్రణ.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR