Home Health వర్షాకాలం చర్మాన్ని రక్షించే చిట్కాలు!

వర్షాకాలం చర్మాన్ని రక్షించే చిట్కాలు!

0
Rainy season skin care tips!

వర్షాకాలం వర్షాలతో పాటు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. అలాంటి సందర్భంలో చర్మ సంరక్షణ ఎంతో ముఖ్యం. వర్షాలను నుంచి వచ్చే స్కిన్ ఎలర్జీ నుంచి చర్మాన్ని, ముఖాన్ని రక్షించుకోవడం కష్టం. వర్షాకాలంలో చాలామంది చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడతారు. వర్షాలకు తడిస్తే చర్మంపై దురదలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో చర్మాన్ని సంరక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి.

వర్షాకాలంలో కొన్నిరకాల క్రీములు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. కానీ కొన్ని చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ చిన్న చిట్కాలు పాటించి మీ చర్మాన్ని రక్షించుకొండి. వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల చర్మంపై అలర్జీలు, హైపర్‌పిగ్మెంటేషన్‌, జిడ్డుదనం-మొటిమలు.. వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు.. ఇంటి పనుల రీత్యా చేతులు, కాళ్లు ఎక్కువ సేపు నీటిలో నానడం వల్ల కూడా ఆయా భాగాల్లో చర్మంపై పగుళ్లు, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తాయి.

అందుకే ఈ కాలంలో మన చర్మాన్ని ఎప్పటికప్పుడు పొడిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇంటి పనులు చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించడం, బయటికి వెళ్లేటప్పుడు రెయిన్‌షూస్‌ వేసుకోవడం వల్ల చేతులు, కాళ్లను సంరక్షించుకోవచ్చు. అలాగే చర్మ ఆరోగ్యానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఇక ఎండ ఉన్నా, లేకపోయినా మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మంచిది.

వర్షాకాలంలో నిమ్మకాయ ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే నిమ్మకాయలో ఎక్కువ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మం మీద దద్దుర్లు కలిగించే అవకాశం ఉంటుంది. పొడిచర్మం ఉన్నవారు నిమ్మకాయను అసలు వాడకూడదు. దుమ్ము, క్రిములు, కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వాల్సి వస్తుంది. ఇవి చర్మానికి చాలా హానికరం. ముఖాన్ని కచ్చితంగా రెండుసార్లు చన్నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముఖంపై పేరుకుపోయిన జిడ్డు తొలగిపోతుంది.

సాధారణంగా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల దాహం వేయదు. అలాగని నీళ్లు తాగకపోయారనుకోండి.. డీహైడ్రేషన్‌, ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ కాలంలోనూ బరువును బట్టి సరైన మోతాదులో నీళ్లు తాగాలి. అవి కూడా మరిగించి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది. వానాకాలంలో నీటి కాలుష్యమయ్యే అవకాశాలు ఎక్కువ. కాచి చల్లార్చిన నీటిని తాగడం శ్రేయస్కరం.

వర్షాకాలంలో ఎక్కువ మేకప్ వేసుకోకుడదు. కానీ వాటర్ ప్రూఫ్ మేకప్‌లు వాడితే.. చర్మానికి ఎలాంటి నష్టం ఉండదు. వర్షాకాలంలో ఆల్కహాల్ ఫ్రీ టోనర్ ఉపయోగించడం చాలా అవసరం. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవాళ్లు.. ఇంకా డ్రై కాకుండా ఉండాలంటే.. టోనర్ కంపల్సరీ వాడాలి. ఒకవేళ ఆయిల్ స్కిన్ ఉంటే.. యాస్ట్రిజెంట్ ఉపయోగించడం మంచిది. వారానికి ఒకసారి కంపల్సరీ హోంమేడ్ స్క్రబ్ ఉపయోగించి డెడ్ స్కిన్ సెల్స్ తొలగించుకోవడం వల్ల.. చర్మం నిగారిస్తుంది.

బియ్యం పిండిలో చర్మాన్ని బిగించే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఫేస్ మాస్కులలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పొడి చర్మం ఉన్నవారు అసలు బియ్యంపిండి వాడకూడదు. ఎందుకంటే బియ్యం పిండి చర్మంలో తేమను తగ్గిస్తుంది. దాంతో ముడతలు వస్తాయి. శనగపిండి చర్మ సంరక్షణలో చాలా ఉపయోగపడుతుంది. వానా కాలంలో జిడ్డు చర్మం ఉన్నవారికి హైడ్రేట్‌గా పనిచేస్తుంది. శనగపిండిలో పాలు లేదా పెరుగు కలిపి చర్మానికి రాస్తే చర్మంలో తేమ పెరుగుతుంది.

రెండు చెంచాల కొబ్బరిపాలలో కొన్ని అరటి పండు ముక్కలు వేసి పేస్టుగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా పూయాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. దీంతో చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. కాసిన్ని పాలలో రెండు కుంకుమ పూరేకలను వేసి కలపాలి. ఇలా చేసిన పదార్థాన్ని ముఖానికి రాసుకోవాలి. కాసేపటి తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.

పెరుగు, పసుపు, తేనే కూడా వర్షాకాలంలో చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మాస్క్ లా వేసుకునేటప్పడు… పోడిచర్మం వారు తేనే రోజ్ వాటర్, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగివేయాలి.. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.

Exit mobile version