చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హనుమ అంటే చాలా ఇష్టం, భక్తి. ఇక ధైర్యసాహసాలకు పెట్టింది పేరు కూడా ఆయనే.. శ్రీరాముడికి హనుమంతుడికి మించిన భక్తుడు మరొకరు ఉండరు. పరమ భక్తుడు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా మనం ఆంజనేయుని గురించి మాట్లాడుకోవాలి.
శ్రీరామచంద్రుడి పట్ల ఎంతో భక్తి భావం కలిగి నిత్యం తన వెంటే ఉండి తన కష్టాలలో భాగమైన ఆంజనేయుడు ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. తన అణువణువునా రాముడు కొలువై ఉన్నాడు. రాముడు కూడా తన సోదరుడైన భరతుడితో సమానంగా అబిమానించాడు.
ఇప్పటివరకు ఆంజనేయుడు శ్రీరాముడు మధ్య ఉన్న భక్తి ప్రేమ గురించి మనం ఎన్నో గ్రంధాలు చదివే ఉంటాము. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే రాముడి పట్ల ఎంతో భక్తి భావంతో ఉండే ఆంజనేయుడు శ్రీరాముడితో గొడవ పడిన సంగతి చాలా మందికి తెలియదు!
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు వీరిద్దరి మధ్య గొడవ రావడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. రామాయణం ప్రకారం రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతో ఉంది. సీతాదేవి అపహరణ సమయంలో ఆంజనేయుడు సాయం మరువలేనిది.
సముద్రాన్ని దాటి లంకకు చేరి సీత జాడను వెతికి అయోధ్యకు చేరి చివరకు హనుమంతుడు పడిన శ్రమ మనకు తెలుస్తుంది. యుద్ధ సమయంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడి పోతే అతడికి మృతసంజీవని కోసం ఏకంగా సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి వారి పట్ల ఉన్న భక్తిని చాటుకున్నాడు.
ఈ విధంగా శ్రీరాముడు, ఆంజనేయుడు ఎంతో ఆప్యాయంగా ఉండటం చూసిన నారదమహర్షి ఎలాగైనా వీరిద్దరికి గొడవ పెట్టాలని భావించాడు. ఒకరోజు కాశీకి చెందిన ఒక రాజు శ్రీరాముడిని కలవడానికి వెళ్తున్న సంగతి తెలుసుకున్న నారదుడు ఆ రాజును కలిసి అతనికి ఒక సహాయం చేయాలని అడుగుతాడు.
అందుకు రాజు ఏమిటో చెప్పు అనగా ముందు మీరు మాట ఇవ్వండి అని అడగగా అందుకు రాజు సరే చేస్తాను అనగా అందుకు నారదుడు మీరు అయోధ్య రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఒక్క విశ్వామిత్రుడిని తప్ప అందరినీ గౌరవించండి. అని చెబుతాడు. అందుకు ఆ రాజు అయోధ్య చేరిన తర్వాత నారదుడికి ఇచ్చిన మాట ప్రకారం విశ్వామిత్రుడికి తప్ప అందరికీ ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చాడు.
విశ్వామిత్రుడికి జరిగిన ఈ అవమానం భరించలేక సాయంత్రానికి ఆ రాజు తల నా కాళ్లదగ్గర పడాలని రాముడిని ఆదేశిస్తాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా ఆదేశించడంతో స్వతహాగా రామభక్తుడైన యయాతి తాను ఎలాంటి పాపం చేయలేదని వీరంజనేయుడిని శరణు కోరతాడు.
యయాతిని రక్షిస్తానని ఆంజనేయుడు అభయమిస్తాడు. మహర్షి ఆజ్ఞ ప్రకారం యయాతిని తనకి అప్పగించాలని హనుమంతుడిని శ్రీరామడు ఆదేశిస్తాడు. యయాతికి మాటిచ్చానని అవసరమైతే తన ప్రాణాలను తీయమని ఆంజనేయుడు ముందుకు వచ్చాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శ్రీరామచంద్రుడు హనుమంతుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. ఈ క్రమంలోనే ఎటువంటి ఆయుధం లేకుండా ఆంజనేయుడు రాముడితో యుద్ధానికి దిగాడు.
ఆంజనేయుడి పై ఎన్ని అస్త్రాలు వేసిన, చివరికి రామబాణం ఉపయోగించిన తన భక్తి ముందు నిలువలేక పోతుంది. ఈ విధంగా శక్తి కంటే భక్తి గొప్పదని నిరూపించిన ఆంజనేయుడు శ్రీరాముడు కలిసి కాశీ రాజును విశ్వామిత్రుని కాళ్ల చెంత పడేసారు. దీంతో శాంతించిన విశ్వామిత్రుడు తనని వదిలేస్తాడు.
ఇదంతా తెలుసుకున్న నారదుడు వారి వద్దకు వెళ్లి ఇదంతా తానే చేశానని.” రామబాణం గొప్పదా.
రామనామం గొప్పదా” అని తెలుసుకోవడం కోసమే ఇలా చేశాం అని నారదుడు తెలియజేస్తాడు.