ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ రామాలయం ఉంది!!!

రామాయణం అనగానే ముందుగా రాముడు గుర్తుకు వస్తాడు. సీతారాముడు అంటే వారి వెంట లక్ష్మణుడు తప్పనిసరిగా ఉంటాడు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నేటికీ అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులు అనే చెబుతారు. ప్రపంచంలో ఎన్నో చోట్ల రామాలయాలు ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో గ్రామానికి ఒకటి చొప్పున రామాలయాలు ఉంటాయి.

ram and sitaప్రతి రామాలయంలో కూడా రాముడితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు ఉంటారు.ఈ నలుగురు ఎక్కడ ఉన్నా కూడా సుఖ సంతోషాలు కలుగుతాయని అందరి నమ్మకం. అన్న తమ్ముళ్ల అనుబంధంను తెలియజేసేదిగా రామ, లక్ష్మణుల బంధం ఉంటుంది. ఎంతో అద్బుతమైన వారిద్దరి బందంకు గుర్తుగా ప్రతి గుడిలో కూడా రాముడి పక్కన సీత, మరో పక్కన లక్ష్మణుడు ఉంటాడు.

రాముడు ఎక్కడ కూడా ఒంటరిగా ఉండకుండా భార్య, సోదరుడు, భక్తుడు అయిన హనుమంతుడిని కలిగి ఉంటాడు. పురాణ కాలం నుండి కూడా శ్రీరాముడు తనను సీత, లక్ష్మణ, హనుమంతుడితో పాటు కొలవాలంటూ భావించాడు. అందుకే తాను ఎక్కడ ఉన్నా వారు కూడా ఉండేలా చేశాడు.

ram, lakshman and sitaఅయితే ప్రపంచంలోనే అత్యంత విచిత్రంగా నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి గ్రామంలో మాత్రం లక్ష్మణుడు లేకుండా శ్రీరామ చంద్రుడు కొలువై ఉన్నాడు.
వేలాది రామాలయాలు ఉన్న ఈ దేశంలో లక్ష్మణుడు లేని ఏకైక రామాలయం ఇదే అంటూ హిందూ ప్రముఖులు అంటున్నారు.

ram and sitaఅయితే ఈ దేవాలయం ఈమద్య నిర్మించినది కాదు, ఏకంగా 250 ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయం.
అద్బుతమైన కట్టడంగా గుర్తింపు ఉన్న ఈ దేవాలయంలో లక్ష్మణుడు ఎందుకు లేడు అనే విషయమై రకరకాల కారణాలు స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ దేవాలయంలో శ్రీరామ చంద్రుల వారు ఆరు అడుగుల ఆజానుబాహు రూపంలో ఉంటాడు. ఇక్కడ లక్ష్మణుడు లేని శ్రీరామ చంద్రుడిని ప్రముఖ హిందూ పరిరక్షకులు శివాజీ గురువు సమర్ధ రామదాసు ప్రతిష్టించారు.

ram, lakshman and hanumanఆయన ఎన్నో దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ట చేశారు.
అయితే స్థానిక పరిస్థితులు మరియు విశిష్టతల నేపథ్యంలో లక్ష్మణుడు లేకుండానే శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు చేయాలని భావించాడు. శ్రీరామ చంద్రుల వారు ఆయన కలలో వచ్చి లక్ష్మణుడు లేకుండా విగ్రహ ఆవిష్కరణ చేయాల్సిందిగా చెప్పాడని కొందరు అంటూ ఉంటారు. మొత్తానికి లక్ష్మణుడు లేని ఈ రామాలయం దేశంలోనే ప్రత్యేకమైనదిగా భావించి జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తారు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR