కొన్ని ఎకరాల స్థలంలో రామబాణం ఆకారంలో నిర్మించిన రామాలయం

0
9225

మన దేశంలో శ్రీరాముడి ఆలయాలు ఎన్నో ఉండగా భద్రాచలంలో వెలసిన శ్రీరామచంద్రమూర్తి ఆలయం చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అయితే దేశంలో ఎక్కడ లేనివిధంగా కొన్ని ఎకరాల స్థలంలో రామబాణం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మికంగా అందరిని ఆకట్టుకుంటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ramanarayanam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా లో రామనారాయణం ఉంది. దాదాపుగా 15 ఎకరాల విస్తీర్ణంలో శ్రీరాముడి ధనుస్సు ఆకారంలో దీనిని నిర్మించడం విశేషం. ఈ అద్భుత నిర్మాణం కోసం దేశంలో పేరుగాంచిన శిల్పకళాకారులు అందరు కూడా పనిచేసారు.

Ramanarayanam

రామాయణంలోని వివిధ ఘట్టాలను 72 విగ్రహాల రూపంలో ఏర్పాటుచేశారు. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం కూడా రామాయణం అంటే ఏంటో అందరికి తెలిసేలా ఎంతో అద్భుతంగా మలిచారు. ఇంకా ఇక్కడ ఒక చివర విష్ణువు, మరొక చివర రాముడి ఆలయం దర్శనం ఇస్తుంది. శ్రీమహావిష్ణువే రాముడి అవతారం అని చెప్పేవిధంగా వీటిని నిర్మించడం ఒక విశేషం.

Ramanarayanam

ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటే, 80 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం, 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇంకా శివపార్వతుల విగ్రహాలు, శివలింగం, అనంత పద్మనాభస్వామి విగ్రహం ఇలా ఇక్కడి ప్రతి ఒక్కటి కూడా ఎంతో అందంగా మలిచిన విధానం అందరిని మంత్రముగ్దుల్ని చేస్తుంది.

Ramanarayanam

శ్రీరాముని పుణ్యక్షేత్రంగా శ్రీరామ ధనుస్సు ఆకారంలో నిర్మించిన ఈ కట్టడం ఇప్పుడు ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రదేశంగా నిలిచింది. ఇంతటి పేరుగాంచిన ఈ నిర్మాణం దివంగత నారాయణం నరసింహమూర్తి సంకల్పంతో సాధ్యమైనదని చెబుతారు.

Ramanarayanam

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ప్రసిద్ధ క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయ ప్రాగణంలో ఔషధ వృక్షాలు ఉన్నాయి. రామనామాన్ని జపించే ప్రతి ఒక్కరు కూడా ఒకసారైనా రామనారాయణం దర్శించుకోవాలని కోరుకునేంతగా నిర్మించిన ఈ ఆలయం ఒక అద్భుతం అని చెప్పవచ్చు.