రావణుడి విచిత్రమైన కోరికలు!!!

రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు. రావణుడు ఒక గొప్ప రాజనీతి కలవాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కలవాడు కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతనిని పూజిస్తున్నారు. మహా శివ భక్తుడు. ఎంత గొప్ప మేధావి అయిన ధర్మాన్ని పాటించక పోతే అన్ని వ్యర్థమే అనేదానికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.

ramరావణుడు సీతను అపహరించుకుపోయి ఆమెను బంధిస్తాడు. కానీ అందుకు ఆమె అంగీకరించదు. దీంతో రావణుడు ఆమె అంగీకరం కోసం ఎదురు చూస్తాడు, కానీ ఆమెను బలవంతంగా ముట్టుకోడు కూడా.

ravana and sitaఈ క్రమంలో రాముడు వానర సైన్యంతో వచ్చి రావణున్ని సంహరించి సీతను తీసుకెళ్తాడు. ఈ కథ అందరికీ తెలిసిందే. అయితే రావణుడు నిజానికి రాక్షసుడే అయినా అతను తన రాజ్యంలో ప్రజలను మాత్రం బాగా చూసుకునేవాడట. అందులో భాగంగానే ప్రజల కోసం పలు మంచి పనులు జరిగితే బాగుండు అని ఎప్పుడూ కోరుకునే వాడట.

ravanaమరి రావణుడు తాను జరగాలని ఎప్పటికీ కోరుకున్న ఆ పనులు, అతనిలో ఉన్న కోరికలు ఏమిటో తెలుసా.?

1.సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే దాన్ని తాగేందుకు అనువుగా దేవుడు మారిస్తే బాగుండు అని రావణుడు కోరుకునేవాడట.

ocean2.ఇక తన రాజ్యంలో రైతులు ఒక్కోసారి వర్షాలు పడక పంటలు పండించలేకపోయేవారట. దీంతో రావణుడు ఏం కోరుకునేవాడంటే. ఇంద్రుడికి పూజిస్తే ఆయన వర్షాలను కురిపిస్తాడు కదా, అలా పూజలు చేస్తే ఇంద్రుడు అందుకు స్పందిస్తే బాగుండును అని అనుకునేవాడట.

3.తన దేహం బంగారం వాసన వస్తే బాగుండును అని రావణుడు అనుకునేవాడట. అదేవిధంగా తండ్రి బతికి ఉన్నంత వరకు అతని కుమారులు చనిపోకూడదని కూడా అనుకునేవాడట.

4.మద్యం అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి, దానికి వాసన లేకుండా ఉంటే బాగుంటుంది అని రావణుడు భావించేవాడట.

wine5.భూమికి స్వర్గానికి మధ్య నిచ్చెన వేస్తే అందులో నుంచి మనుషులు నడిచి వెళ్తారు కదా అని రావణుడు కోరుకునేవాడట.

6.మానవుల రక్తానికి రంగు లేకుండా ఉంటే బాగుంటుందని, మనుషులందరూ సమానమే అని సూచించేలా అందరూ తెల్లగా ఉంటే బాగుంటుందని కూడా రావణుడు అనుకునేవాడట.!

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR