హనుమంతుడుని సంజీవ రాయుడు గా కొలవడానికి గల కారణం

చిరంజీవిగా నమ్మిన భక్తుల వెన్నంటే ఉండి ఆదుకునే దైవం హనుమాన్. శ్రీరామ దాసుడిగా భక్తికి కొత్త నిర్వచనం చెప్పిన వీర హనుమాన్ ని చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకు అందరూ తమ ఆరాద్య దైవంగా కొలుచుకుంటున్నారు. భారత దేశంలో హనుమంతుడుకి అనేక దేవాలయాలు ఉన్నాయి.

Sanjeeva Rayuduఅయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ దేవాలయం మాత్రం అత్యంత ప్రత్యేకమయ్యింది. హనుమంతుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాలలో ‘వెల్లాల’ కూడా ఒకటి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ హనుమంతుడు `సంజీవ రాయుడు`గా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

Sanjeeva Rayuduఈ సంజీవ రాయుడు కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తాడని భక్తుల విశ్వాసం. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని మొక్క కోసం బయలుదేరిన హనుమంతుడు, సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చేందుకు ఇక్కడి కుందూ నది దగ్గర ఆగాడట. అయితే మహర్షులు హనుమంతుడిని దర్శించుకున్న అనంతరం కాసేపు ఉండమని అడగగా హనుమంతుడు ‘వెళ్లాలి .. వెళ్లాలి’ అంటూ ఆతృతను కనబరిచాడట. అందుకే ఈ గ్రామానికి ‘వెల్లాల’ అనే పేరు వచ్చిందని గ్రామస్థులు అంటుంటారు.

Sanjeeva Rayuduఇక మహర్షుల అభ్యర్థన మేరకు ఆ తరువాత కాలంలో ఇక్కడ వెలసిన స్వామికి, 15వ శతాబ్దంలో హనుమంత మల్లు అనే రాజు ఆలయాన్ని నిర్మించారట. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వల్ల, ఆకు పూజలు జరిపించడం వల్ల, ఆపదలు, గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

Sanjeeva Rayuduఅదేవిధంగా, వ్యాధులు, బాధలు కూడా దూరమవుతాయనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి ప్రీతికరమైన వడమాలలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ వుంటారు. ఆరోగ్య సమస్యలు, బాలారిష్టాలు ఉన్నవారు ఇక్కడ స్వామిని సేవిస్తే తప్పక అవి దూరం అవుతాయని పండితులు పేర్కొంటున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR